Vijay Devarakonda: విజయ్ – పరశురామ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీ డిజప్పాయింట్ చేసింది. ఆ తర్వాత ‘జన గణ మన’ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేసినా అది అనుకోకుండా ఆగిపోయింది. ప్రస్తుతం విజయ్… శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల ఈ చిత్రం షూటింగ్ కు బ్రేక్ పడినట్టైంది. అయితే సినిమా చాలా బాగా వస్తుందని వినికిడి. విజయ్ నటించిన గత మూడు సినిమాలు నిరాశపరిచాయి.

కాబట్టి.. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైం ఇది. అందుకే తర్వాతి సినిమాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పరశురామ్ తో కూడా ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. దిల్ రాజు బ్యానర్లో ఈ మూవీ చేయాల్సి ఉంది. ఇది ‘గీత గోవిందం’ చిత్రానికి సీక్వెల్ అనే ప్రచారం జరిగింది. దీంతో ఆ చిత్రాన్ని నిర్మించిన అల్లు అరవింద్ కు కోపం కూడా వచ్చింది. కానీ ఇది ఆ కథ కాదని చెప్పి అల్లు అరవింద్ ను కూల్ చేశాడు పరశురామ్.

ఇక విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – పరశురామ్ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ ఉండనే ఉంది. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే తో విజయ్ .. ‘జన గణ మన’ లో నటించాలి. కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు ఆమె కాల్ షీట్లు కూడా ఖాళీగా లేవు. మరోపక్క ‘సీతా రామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను కూడా అనుకుంటున్నారు.

ఆమె కూడా చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వీళ్ళిద్దరూ వర్కౌట్ అవ్వకపోతే రష్మికనే ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయ్ తో సినిమా అంటే రష్మిక ఎలాగైనా డేట్ అడ్జస్ట్ చేసుకుని మరీ వచ్చేస్తుంది. పైగా దర్శకుడు పరశురామ్ కూడా రష్మిక వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus