Kalki: వామ్మో.. ప్రభాస్ సినిమా కోసం ఏకంగా ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?

స్టార్ హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కల్కి 2898 ఏడీ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ప్రభాస్ కోరుకున్న ఇండస్ట్రీ హిట్ ను అందిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుంది. టీజర్ రిలీజ్ తో ఈ సినిమా కథ గురించి సైతం క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

అయితే కల్కి సినిమా కోసం ఏకంగా 3 క్లైమాక్స్ లను సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే ఈ మూడు క్లైమాక్స్ వెర్షన్ లలో ఒక వెర్షన్ ను ఫైనల్ చేసి షూట్ చేయనున్నారని భోగట్టా. ప్రాజెక్ట్ కే ఫస్ట్ పార్ట్ త్వరలో పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. కల్కి సినిమా బడ్జెట్ 800 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటిగా ఉంది. కల్కి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భారీ క్యాస్టింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైనట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకు (Kalki) ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయాలని నెటిజన్లు ఫీలవుతున్నారు. ప్రాజెక్ట్ కే మూవీ మే నెల 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రభాస్ సినిమాలలో మెజారిటీ సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం ప్రభాస్ తన టాలెంట్ తో సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus