పుష్ప ది రూల్ సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా కోసం డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గంగమ్మ జాతర ఎపిసోడ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ఖర్చు ఏకంగా 50 కోట్ల రూపాయలు అని సమాచారం. ఒక్క సీక్వెన్స్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం చాలా అరుదు అనే చెప్పాలి. అరగంట పాటు ఉండే ఈ సీక్వెన్స్ ను సుకుమార్ ఏకంగా 35 రోజుల పాటు షూట్ చేశారని ఈ ఎపిసోడ్ లోనే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఉండనుందని తెలుస్తోంది.
బన్నీ లుక్ కూడా ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను ఫిదా చేసేలా ఉండనుందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమా గురించి అంచనాలు పెంచేలా రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నుంచి అప్ డేట్ రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పుష్ప ది రూల్ మూవీ కాన్సెప్ట్ అదిరిపోతుందని కథ, కథనం కొత్తగా ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.
పుష్ప ది సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. పుష్ప ది రూల్ సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమా ఆగష్టు నెల 15వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుందని తెలుస్తోంది. బన్నీ ఇతర భాషల్లో సైతం మరింత ఎదిగేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.