Yash: ‘కె.జి.ఎఫ్’ హీరో యశ్ క్రేజ్ ను చెడగొట్టేలా ఉన్నారుగా..!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఏ కన్నడ హీరోకి దక్కని ఛాన్స్ ఇది. భవిష్యత్తులో మరో కన్నడ హీరోకి ఇలాంటి అవకాశం దక్కుతుందా లేదా అన్న విషయాన్ని కూడా చెప్పలేము. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి యష్ చాలా బాధ్యతగా కథలను ఎంపిక చేసుకోవాలి. అతనికి ఇప్పుడున్న స్టార్ డంని మ్యాచ్ చేసేలా సినిమాలు తీసే దర్శకులు కన్నడలో లేరు.

ఈ విషయాన్ని అతను కూడా గ్రహించాలి. అయితే ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కదా అని అతని పాత సినిమాలను కూడా విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని కొందరు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. యష్ నటించిన ‘రారాజు’ అనే చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. ఇది 6 ఏళ్ళ క్రితం అంటే 2016లో కన్నడలో రిలీజ్ అయిన ‘సంతు స్ట్రైట్ ఫార్వర్డ్’ అనే చిత్రానికి డబ్బింగ్ వెర్షన్.

మహేష్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ ద్వితీయార్థంలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. ట్రైలర్ ను దర్శకుడు వి వి వినాయక్ తో లాంచ్ చేయించారు. ఈ మూవీలో యష్ కు జోడీగా అతని భార్య రాధికా పండిట్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మాత్రమే కాదు యష్ నటించిన ‘లక్కీ’ మూవీని కూడా ‘లక్కీ స్టార్’ గా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు.

2012 లో వచ్చిన మూవీ అది. అంటే ఆ సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్ళు పూర్తయ్యింది. ఇలా ఎప్పుడెప్పుడో సినిమాలను విడుదల చేస్తే ఆ సినిమాలు ఆడకపోగా ఫలితంగా యష్ క్రేజ్ పూర్తిగా ఎరేజ్ అయిపోయే ప్రమాదం ఉంది. యష్ ఇలాంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంది. లేదంటే ‘గజకేసరి’ లాంటి ఫలితాలు వస్తాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus