ఈ చిన్న హీరోల పాన్-ఇండియా ప్రయత్నాలు ఫలిస్తాయా ??

ఇప్పుడు ఎక్కడ చుసిన పాన్-ఇండియా సినిమాలే కొంచెం సబ్జెక్టు బాగుంటే చాలు ప్రతి హీరో సినిమా పాన్-ఇండియా రిలీజ్ అయిపోతుంది. ప్రభాస్, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోస్ అంత ఇప్పుడు పాన్-ఇండియా అప్పీల్ ఉన్న కథలు చేస్తున్నారు. పెద్ద హీరోస్ కాదు మేము కూడా పాన్-ఇండియా మూవీస్ తీస్తాం అని అంటున్నారుజోందరు యంగ్ హీరోస్. అనడమే కాదు కొందరు టైర్-2 హీరోస్ ఆల్రెడీ ఈ పనుల్లో బిజీ అయిపోయారు. రీసెంట్ గా కార్తికేయ 2 , మేజర్ సినిమాలతో నిఖిల్ & అడివి శేష్ లు ఇద్దరు పాన్-ఇండియా హిట్స్ కొట్టేసారు కూడా.

ఇది చూసాక మన టాలీవుడ్లో ఉన్న ఇంకా కొందరు యంగ్ హీరోస్ మేము కూడా పాన్-ఇండియా మూవీస్ చేస్తాము అంటూ రెడీ అయిపోయి ఆల్రెడీ కొన్ని పాన్-ఇండియా సినిమా రెలీజ్స్ తో రెడీ అయిపోయారు.

ఈ సంవత్సరం మీరు పాన్-ఇండియా మూవీస్ తో రెడీ అయిపోయిన ఆ యంగ్ హీరోస్ ఎవరు ఆ సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం…

1. నాని దసరా

శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో నాని దసరా అనే తెలంగాణ నేపధ్యం ఉన్న మాస్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు…నాని & కీర్తి సురేష్ లీడ్ రోల్స్ చేస్తున్న…ఈ సినిమా తెలంగాణలో ఉన్న గోదావరి ఖనిలో జరుగుతుంది…ఈ సినిమా, ఈ సబ్జెక్టు పాన్-ఇండియా ఆడియన్స్ కి నచ్చుతుంది అనే ధీమాతో హిందీ, తమిళ్, కన్నడ & మలయాళంలో ఈ సినిమాని పాన్రి-ఇండియా రిలీజ్ చేస్తున్నారు.

2. అఖిల్ అక్కినేని ఏజెంట్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో… అఖిల్ అక్కినేని ఏజెంట్ అనే ఒక ఔట్ అండ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తో అఖిల్ పాన్-ఇండియా మార్కెట్ మీద కన్నేశాడు…మరి చూడాలి ఈ సినిమా ఎం అవుతుందో అనేది…

3. విజయ్ దేవరకొండ ఖుషి

విజయ్ దేవరకొండ & సమంత కాంబినేషన్లో ఖుషి సినిమా రాబోతుంది..ఈ సినిమాకి నిన్ను కోరి, మజిలీ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఖుషి సినిమా మంచి లవ్ స్టార్ అని చెప్తున్నారు మేకర్స్ అండ్ లీగర్ తో పాన్-ఇండియా డిసాస్టర్ చుసిన రౌడీ ఈ మూవీ తో అయినా పాన్-ఇండియా కొడతాడా లేదో చూడాలి…

4. #VT13 – వరుణ్ తేజ్

కాన్సెప్ట్ బేస్డ్ and కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే మెగా హీరో వరుణ్ తేజ్ నెక్స్ట్ ఇప్పుడు IAF pilot రోల్ చేస్తూ ఒక యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమా హిందీ-తెలుగు బైలింగ్వల్ సినిమాగా రాబోతుంది అలాగే ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ అవుతుంది.

5. హను-మాన్

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ, మొదటి సారి ఒక కొత్త సూపర్ హీరో సినిమా హను-మాన్ చేస్తున్నాడు. తేజ సజ్జ యాక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ఆల్రెడీ సినిమా మీద అంచనాలను పెంచేసింది…ఇంకా కొంచెం బాగున్నా చాలు కార్తికేయ, కాంతారా లాగ పెద్ద పాన్-ఇండియా హిట్ చేస్తారు నార్త్ ఆడియన్స్.

6. సాయి ధరమ్ తేజ్ – విరూపాక్ష

సాయి ధరమ్ తేజ్ చాల గ్యాప్ తరువాత చేస్తున్న మూవీ విరూపాక్ష. సుకుమార్ రైటింగ్స్ సుకుమార్ కూడా ఒక ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో పాన్-ఇండియా రిలీజ్ గా రాబోతుంది.

7. గూఢచారి 2

గూఢచారి ఫస్ట్ పార్ట్ తరువాత ….అడివి శేష్ అండ్ టీం, గూఢచారి 2 సీక్వెల్ తో రెడీ అయిపోయారు. మేజర్ లాంటి పాన్-ఇండియా కొట్టిన శేష్ ఇప్పుడు గూఢచారితో ఇంకో పాన్-ఇండియన్ హిట్ కి సిద్ధం అయిపోయాడు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus