బాలీవుడ్ కి మొట్టమొదటి 100 కోట్ల రికార్డ్ సాధించిపెట్టిన “గజినీ”, కెరీర్ అయిపోతుంది అనుకొన్న తరుణంలో సల్మాన్ ఖాన్ ను మళ్ళీ నిలబెట్టిన “వాంటెడ్”, ప్రస్తుతం బాలీవుడ్ క్రిటిక్స్ అందరూ ఏకీపడేసినప్పటికీ 200 కోట్లు కలెక్ట్ చేసిన “కబీర్ సింగ్” వరకూ అన్నీ సౌత్ సినిమాలే. అయితే.. సరైన డైరెక్టర్ ఉంటే తప్ప సౌత్ సినిమాల రీమేక్ లు బాలీవుడ్ లో హిట్ అవ్వడం కష్టం అని మరోసారి ప్రూవ్ అయ్యింది. తెలుగులో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “పెళ్ళిచూపులు” చిత్రాన్ని హిందీలో “మిత్రోన్” అనే పేరుతో రీమేక్ చేస్తే డిజాస్టర్ అయ్యింది.
ఇప్పుడు అదే ఫార్మాట్లో తెలుగు-తమిళ భాషల్లో కల్ట్ హిట్ గా నిలిచిన “7జి బృందావన కాలనీ” గురించి తెలియని వారుండరు. ప్రేమికులను మాత్రమే కాదు.. యావత్ తెలుగు-తమిళ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించిన లవ్ ఎంటర్ టైనర్. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మరాఠీలో రీమేక్ చేశారు. “మలాల్” అనే పేరుతో రూపొందిన ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ & ప్రొడ్యూసర్స్ లో ఒకడైన సంజయ్ లీలా భన్సాలీ బంధువులు హీరోహీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఈ మరాఠీ వెర్షన్ “7జి బృందావన కాలనీ” చూసిన తెలుగు సినిమా అభిమానులు “చెడగొట్టేశారు కదరా” అని బండ బూతులు తిడుతున్నారు. ములకథలో కూడా భారీ స్థాయి మార్పులు చేయడమే ఇందుకు కారణం.