Nagarjuna: ‘బంగార్రాజు’ లో హీరోయిన్ల లిస్ట్ బయటపెట్టిన దర్శకుడు..!

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి’, ‘జీ స్టూడియోస్’ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.2016లో సంక్రాంతికి కానుకగా విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సంక్రాంతికి విన్నర్ గా నిలిచింది ఈ చిత్రం.

6 ఏళ్ళుగా ‘సోగ్గాడే’ స్థాయిలో మరో హిట్టు కొట్టలేకపోయాడు నాగార్జున. ఈసారి మాత్రం కచ్చితంగా హిట్టు కొట్టాలని మరోసారి ‘బంగార్రాజు’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవ్వడంతో ‘బంగార్రాజు’ పై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగానే ఉంది. ప్రమోషన్లలో కూడా ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెడుతూ టీం హల్ చల్ చేస్తుంది. అందులో ముఖ్యంగా ‘బంగార్రాజు’ లో 7 మంది హీరోయిన్లు నటించినట్టు నాగార్జున ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

ఈ విషయం పై దర్శకుడు కళ్యాణ్ కృష్ణా మాట్లాడుతూ.. ‘7 మంది కాదు 8 మంది హీరోయిన్లు కనిపిస్తారు మా సినిమాలో’ అంటూ చెప్పి మరింత ఆసక్తిని పెంచాడు. వాళ్ళు ఎవరని అతన్నే ప్రశ్నిస్తే.. రమ్య కృష్ణ, కృతి శెట్టి, ఫరియా అబ్దుల్లా, మీనాక్షి దీక్షిత్,దర్శిని, వేదిక,దక్ష నగార్కర్,సిమ్రత్ కౌర్ అంటూ జవాబిచ్చాడు. పాటల్లో కొంతమంది.. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలుగా కొంతమంది ఇలా సందర్భానుసారంగా వాళ్ళు వస్తుంటారని తెలిపాడు కళ్యాణ్ కృష్ణ.

నాగార్జున, నాగ చైతన్య అభిమానులకి మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులందరికీ ఈ చిత్రం ఓ పండుగలా ఉంటుందని హామీ ఇచ్చాడు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus