ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న 8 సినిమాలు ఏంటో తెలుసా..?

‘అఖండ’ తో టాలీవుడ్ కు ఊపు వచ్చింది.తక్కువ టికెట్ రేట్లు ఉన్నప్పటికీ పెద్ద సినిమాలు రెండు,మూడు చూస్తారు ప్రేక్షకులు అని ‘అఖండ’ నిరూపించింది. దాంతో భయపడకుండా వరుసగా పెద్ద సినిమాలు ముందడుగు వేస్తున్నాయి. డిసెంబర్ 17న ‘పుష్ప’ రిలీజ్ కాబోతుంది. అటు తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ వస్తుంది. అటు తర్వాత సంక్రాంతి సినిమాల హవా మొదలవుతుంది. కాబట్టి చిన్న చితకా సినిమాలు అన్నీ డిసెంబర్ 10నే కన్నేశాయి. ఈ వారం కూడా 8 సినిమాలు థియేటర్ కు రాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి :

1) లక్ష్య

2) గమనం

3) మ‌డ్డీ

4) నయీమ్ డైరీస్

5) బుల్లెట్ సత్యం

6) కటారి కృష్ణ

7) మనవూరి పాండవులు

8) ప్రియతమా

ఈ లిస్ట్ లో కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు ఒక్క ‘లక్ష్య’, ‘గమనం’ మాత్రమే..! నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ‘లక్ష్య’ లో యాక్షన్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆకర్షించే విధంగా ఉంది. కాబట్టి ఈ వీకెండ్ కు జనాలకి ఫస్ట్ ఛాయిస్ ‘లక్ష్య’ అనే చెప్పాలి. ఆ తర్వాత చూసుకుంటే ‘గమనం’ చిత్రం పై ప్రేక్షకుల ఫోకస్ ఉంది. డీఓపీ జ్ఞాన‌శేఖ‌ర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. సుజనా రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించగా బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాసారు. శ్రీయ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.