Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Reviews » 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 20, 2025 / 07:34 AM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రవితేజ దుగ్గిరాల (Hero)
  • అనంతిక సానిల్ కుమార్ (Heroine)
  • హను రెడ్డి (Cast)
  • ఫణీంద్ర నార్సెట్టి (Director)
  • వై.రవిశంకర్ - నవీన్ ఎర్నేని (Producer)
  • హేషమ్ అబ్దుల్ వహాబ్ (Music)
  • విశ్వనాథ్ రెడ్డి (Cinematography)
  • శశాంక్ మాలి - ఫణీంద్ర నార్సెట్టి (Editor)
  • Release Date : జూన్ 20, 2025
  • మైత్రీ మూవీ మేకర్స్ (Banner)

దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్న ఫణీంద్ర నార్సెట్టి (Phanindra Narsetti) తెరకెక్కించిన రెండో సినిమా “8 వసంతాలు” (8 Vasantalu). రవితేజ, అనంతిక, హను రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం విశేషం. “ప్రేక్షకుడిగా థియేటర్ కి వచ్చి ప్రేమికుడిగా బయటకు వెళ్తారు” అని ఫణీంద్ర ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎంత నిజముందో చూద్దాం..!!

8 Vasantalu Review

కథ: ఒక సింగిల్ లైన్ పాయింట్ గా చెప్పాలంటే.. “8 వసంతాలు” ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అయితే.. ఆ త్రికోణపు ప్రేమలో ఎవరిది నిజమైన ప్రేమ?, ఎవరిది వ్యామోహం? అనేది కవితాత్మక ధోరణిలో ఫణీంద్ర తెరకెక్కించిన చిత్రమే “8 వసంతాలు”.

8 Vasantalu Movie Review and Rating

నటీనటుల పనితీరు: అనంతిక పోషించిన శుద్ధి అయోధ్య పాత్రను తెర మీద చూసాక, ఈ పాత్రను ఈ అమ్మాయి తప్ప మరెవరూ ఇంత స్వచ్ఛతతో పోషించలేరేమో అనిపించకమానదు. ఆమె నటన ఓ సాధనలా కనిపిస్తుంది. అది మొండితనం కావచ్చు, ప్రేమభారాన్ని మోయలేక ఇబ్బందిపడే కన్నెపిల్ల భావన కావచ్చు, విరహవేదన తాళలేని ఆడపిల్ల మానసిక అలసట కావచ్చు, చిగురించడానికి ముందే వాడిపోయిన ప్రేమ తాలూకు బాధను దిగమింగే భగ్న ప్రేమికురాలిగా కావచ్చు, గురువు కోసం గుండు కొట్టించుకోవడానికి సైతం సిద్ధపడిన శిష్యురాలిలా కావచ్చు.. ఎన్నో బరువైన ఎమోషన్స్ ను అద్భుతంగా పండించింది అనంతిక. ఆమెకు ఎన్నో రకాల కళల మీద ఉన్న పట్టుకి, శుద్ధి అయోధ్య లాంటి పాత్ర దొరకడంతో.. ఆమె ఆ పాత్రను పండించిన విధానం నవతరం ప్రేక్షకులకే కాక నిన్నటితరం ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుంది.

రవితేజ దుగ్గిరాల చూడ్డానికి జూనియర్ జావేద్ అలీలా ఉన్నాడు. అతడి కళ్లలో పలికే భావం స్పష్టంగా ఉంది. “8 వసంతాలు” అనే టైటిల్ జస్టిఫికేషన్ ను సంజయ్ పాత్ర ద్వారా వివరించిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది, పర్సనల్ గా నా ఫేవరెట్ సీన్ కూడా అదే.

హను రెడ్డి హావభావాలు చాలా బాగున్నాయి. అతడి పాత్ర ఎందుకని అలా రియాక్ట్ అవుతుంది అనేందుకు ఇచ్చిన జస్టిఫికేషన్ సరిగ్గా లేకపోవడంతో.. ఇంటర్వెల్ బ్యాంగ్ లో అతడి పాత్ర తేలిపోతుంది. బహుశా హీరోయిన్ ఎమోషన్ ను ఎలివేట్ చేయడానికి అలా చేసి ఉండొచ్చు కానీ.. ఇంకాస్త బెటర్ & కన్విన్సింగ్ రీజన్ ఉంటే బాగుండేది.

తల్లి పాత్ర పోషించిన ఆర్టిస్ట్, గురువుగా నటించిన నటుడు, స్నేహితుడిగా కన్నా, స్నేహితురాలి పాత్రలో కనిపించిన అమ్మాయి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

8 Vasantalu Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: సినిమాలో హీరోయిన్ రచయిత అయిన హీరోని ఒక ప్రశ్న అడుగుతుంది. ఎండింగ్ ముందు అనుకుని తర్వాత కథ రాసుకున్నారా? అని. సినిమా చూశాక నాకు కూడా ఫణీంద్రను అదే అడగాలి అనిపించింది. ఈ సమీక్షను అతడు చదివే అవకాశం ఉన్నందున, సినిమా సక్సెస్ మీట్ లేదా ఏదైనా ఇంటర్వ్యూలో ఈ విషయమై స్పందించాల్సిందిగా మనవి. అయితే.. ఆ ప్రశ్న తలెత్తడానికి కారణం ఏంటంటే, సినిమాను మొదలుపెట్టిన విధానం బాగుంటుంది, అయితే.. రెండో ప్రేమకథను ఎస్టాబ్లిష్ చేసే విధానం చాలా పేలవంగా సాగుతుంది. ఇక హీరోయిన్ తన మలి ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడడం వెనుక బలమైన కారణం ఉండదు. అయితే.. ముగింపు మాత్రం దాదాపుగా ఒక సంతృప్తినిచ్చే ప్రయత్నం చేస్తుంది. అది ప్రయత్నంగా మిగిలిపోవడానికి కారణం మలిభాగంలో సినిమా సాగిన తీరు. అందుకు కారణం ఈ సినిమాకి ఎడిటర్ కూడా ఫణీంద్ర కావడమే అనేది నా భావన. తాను రాసుకున్న సన్నివేశాలపై అమితమైన ప్రేమతో వాటిని కటువుగా కత్తిరించలేక ప్రేక్షకుల సహనాన్ని కొద్దిగా పరీక్షించాడు.

ఫణీంద్ర ప్రాసలు ఎక్కడున్నాయి అంటాడు కానీ.. సినిమాలో కొన్ని ప్రాసలు అనవసరంగా దొర్లాయి. చాలా వరకు ఎమోషన్ లో కొట్టుకుపోయాయి కానీ “గ్లిజరిన్ లో ముంచిన గుండె” అనే డైలాగ్ మాత్రం చాలా అసహజంగా అనిపించింది. ఇక ఫణీంద్ర 5 నిమిషాల పాటు పెన్ను పక్కన పెట్టి రాసిన వారణాసి ఫైట్ ఎపిసోడ్ కూడా అంత సినిమాటిక్ హై ఇవ్వకపోగా.. కథా గమనానికి ఏమాత్రం తోడ్పడలేక కేవలం ఇరికించబడిన ఓ కమర్షియల్ ఎలిమెంట్ గా మిగిలిపోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే.. ఫణీంద్రలోని దర్శకుడిని రచయిత డామినేట్ చేయగా.. ఎడిటర్ ఆ రచయితను కంట్రోల్ చేయకపోవడంతో “8 వసంతాలు” టార్గెట్ ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో సంతుష్టపరచలేకపోయింది. అయితే.. ఫణీంద్ర చెప్పినట్లుగా థియేటర్ నుంచి బయటికి వెళ్లే ప్రేక్షకుడు మరీ ప్రేమికుడిలా కాకపోయినా.. ప్రేమతత్వం బోధపడిన ఓ ప్రేక్షకుడిగా నిలుస్తాడు.

హేషమ్ సంగీతం వినసొంపుగా, వనమాలి సాహిత్యం అర్థవంతంగా ఉన్నాయి. ఇంకొన్ని పాటలు ఉంటే బాగుండు అనిపించింది. అయితే.. ఈ సినిమాని పోయిటిక్ లవ్ స్టోరీగా మలచాలి అని ఫణీంద్ర మంకుపట్టు ఈ చిత్రాన్ని మ్యూజికల్ లవ్ స్టోరీ అవ్వనివ్వకుండా ఆపింది.

విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. వర్షం షాట్స్ లో అనంతిక ముఖంలో భావాలను క్యాప్చూర్ చేసిన విధానం, కొన్ని మెటాఫరికల్ షాట్స్ ను కంపోజ్ చేసుకున్న తీరు కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

నిర్మాతలు ఈ కథను నమ్మి ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. కాశ్మీర్, ఊటీ, ఆగ్రా వంటి లొకేషన్స్ లో చాలా లావిష్ గా సినిమాను రూపొందించారు.

8 Vasantalu Movie Review and Rating

విశ్లేషణ: మనకి తెలిసింది ప్రేక్షకులకు అర్థవంతంగా చెప్పడం వేరు. మనకి మాత్రమే తెలుసు అని మనకి నచ్చినట్లుగా చెప్పి, వాళ్లని అర్థం చేసుకోవాల్సింగా కమాండ్ చేయడం వేరు. ఫణీంద్ర నార్సెట్టి ఈ రెండోది చేశాడు. అక్షరం ఎంచుకున్న ఓ యువకుడు, ప్రపంచాన్ని చూసిన ఓ శ్రామికుడు వాడుక భాషలో మాట్లాడితే బాగుండు. అలాగే.. ప్రతి ఒక్కరూ కవితాత్మక భావంతోనే మాట్లాడుతుంటారు. తెలుగు భాషను బ్రతికించాలన్న తపన మంచిదే.. అయితే అది కావాల్సినంత ఆక్సిజన్ ఇచ్చి బ్రతికిస్తున్నామా? లేక అవసరమైన దానికంటే ఎక్కువ ఆక్సిజన్ పైపులు నోట్లో కుక్కేసి ఇబ్బందిపెడుతున్నామా అనే విషయాన్ని ఓసారి స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. “8 వసంతాలు” కచ్చితంగా మంచి అనుభూతినిచ్చే చిత్రమే, అయితే.. సంతృప్తినివ్వదు. అనుభూతి క్షణికం, సంతృప్తి శాశ్వతం. ఆ క్షణికమైన అనుభూతినిచ్చే టైటిల్ జస్టిఫికేషన్ కోసం “8 వసంతాలు” సినిమాని కాస్త ఓపికతో చూడొచ్చు.

8 Vasantalu Movie Review and Rating

ఫోకస్ పాయింట్: ముగింపు కోసమే మొదలైన ప్రేమలేఖ!

8 Vasantalu Movie Review and Rating

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #8 Vasantalu
  • #Ananthika Sanilkumar
  • #Hanu Reddy
  • #Hesham Abdul Wahab
  • #Kanna Pasunoori

Reviews

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jatadhara Review in Telugu: జటాధర సినిమా రివ్యూ & రేటింగ్!

Jatadhara Review in Telugu: జటాధర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. దీపావళి సినిమాలు అన్నీ!?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. దీపావళి సినిమాలు అన్నీ!?

14 mins ago
Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Jatadhara Collections: స్టడీగా కలెక్ట్ చేసినా.. ‘జటాధర’ కి కష్టంగానే ఉంది

Jatadhara Collections: స్టడీగా కలెక్ట్ చేసినా.. ‘జటాధర’ కి కష్టంగానే ఉంది

6 hours ago
The Girl Friend Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

7 hours ago
Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Dulquer Salmaan: నాకు నటన రాదు అని విమర్శించారు: దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan: నాకు నటన రాదు అని విమర్శించారు: దుల్కర్ సల్మాన్

10 mins ago
Adivi Sesh: అడివి శేష్ ‘గోల్డెన్ రూల్’?

Adivi Sesh: అడివి శేష్ ‘గోల్డెన్ రూల్’?

28 mins ago
సీనియర్ నటి మృతి.. శోకసంద్రంలో ఇండస్ట్రీ!

సీనియర్ నటి మృతి.. శోకసంద్రంలో ఇండస్ట్రీ!

32 mins ago
Buchi Babu: టాలీవుడ్ టూ బాలీవుడ్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద స్కెచ్ వేసాడు..!

Buchi Babu: టాలీవుడ్ టూ బాలీవుడ్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద స్కెచ్ వేసాడు..!

57 mins ago
Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version