8వ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే..! ఎవరెవరు ఉన్నారంటే.?

బిగ్ బాస్ నాన్ స్టాప్ నో కామా నో పుల్ స్టాప్ అన్నట్లుగానే 8వ వారం నామినేషన్స్ రచ్చలేపుతున్నాయి. ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో నామినేషన్స్, ఎలిమినేషన్ అనేవి హైలెట్ గా ఉంటాయన్న విషయం తెలిసిందే. అన్నట్లుగానే ఈవారం నామినేషన్స్ తో హౌస్ వేడెక్కిపోయింది. ముఖ్యంగా బిందుమాధవి – అఖిల్ మద్యలో మరోసారి వార్ మొదలైంది. లాస్ట్ వీక్ స్రవంతి టాపిక్ తోనే ఇద్దరూ ఆర్గ్యూ చేసుకుంటే, ఇప్పుడు కూడా స్రవంతి విషయంలోనే ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నారు.

Click Here To Watch NOW

తను హౌస్ నుంచీ వెళ్లిపోయాక స్టాండ్ తీస్కోవడం కాదు బిందు అంటూ అఖిల్ మాట్లాడితే, తనని ఎమోషనల్ గా వాడుకోలేదా ? వాళ్లకోసం వీళ్లకోసం స్టాండ్ తీస్కున్నావ్ కానీ, స్రవంతి కోసం ఆరోజు నిలబడలేదంటూ బిందు వాగ్వివాదం పెట్టుకుంది. ఇద్దరి మద్యలో హీటెడ్ ఆర్గ్యూమెంట్ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. రీసంట్ గా వచ్చిన ప్రోమోలో ఒకరి ముఖంపై మరొకరు ఫోమ్ పూసుకుంటూ రెచ్చిపోయారు. అరియానా, అషూరెడ్డి, హమీదా, అనిల్ ఇలా అందరూ అషూ కెప్టెన్సీని , సంచాలక్ గా తీస్కున్న నిర్ణయాలని మరోసారి స్క్రీన్ లోకి తీసుకుని వచ్చారు.

నిజానికి బెస్ట్ ఫ్రెండ్స్ లా కలిసిపోయిన అరియానా ఇంకా అషూలకి ఇప్పుడు ఇద్దరిమద్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండుతోంది. బద్ద శత్రువులుగా మారిపోయారు. నీకు ఏవిషయంలో కాలిందో నాకు తెలియదు కదా అంటూ అషూరెడ్డి మాట్లాడితే, అరియానా తనదైన స్టైల్లో కౌంటర్ ఎటాక్ చేసింది. సీజన్ 4లో అరియానాని మరోసారి గుర్తు చేసింది. అలాగే, అజయ్ ఇంకా హమీదాలు కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకుని రెచ్చిపోయారు. నువ్వు హౌస్ లో నుంచీ వెళ్లే వరకూ నేను నామినేట్ చేస్తునే ఉంటా అంటూ హమీదా చెప్తే, నేను కూడా అలాగే చేస్తా అంటూ అజయ్ ఛాలెంజ్ విసిరాడు.

ఇక బిందు ఛాలెంజ్ చేస్తూ అఖిల్ ని పాయింట్ చేస్తూ ఫోమ్ కొట్టి మరీ దెబ్బకొట్టింది. దీంతో అఖిల్ కూడా నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా సమాచారం. ఈవారం కెప్టెన్ కాబట్టి శివ నామినేషన్స్ నుంచీ తప్పించుకున్నాడు. అలాగే, నటరాజ్ మాస్టర్, అరియానా ఇద్దరూ కూడా నామినేషన్స్ లోకి రాలేదు. మరో మేటర్ ఏంటంటే, ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన బాబా భాస్కర్ స్పెషల్ పవర్ తో నామినేషన్స్ లో ఉన్న ఒకరిని సేవ్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఒకరి ముఖంపై ఒకరు ఫోమ్ రాసుకుని మరీ వాదించుకుని నామినేట్ చేసుకున్నారు. హాట్ హాట్ గా జరిగిన 8వ వారం నామినేషన్స్ లో అఖిల్, అషూ, అజయ్ ,అనిల్, హమీదా, బిందుమాధవి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus