Sampath Raj: నటుడు సంపత్ రాజ్ విడాకులకు కారణమిదేనా..?

మిర్చి సినిమాలో విలన్ గా ఒక్కసారిగా లైంలైట్ లొకి వచ్చిన విలన్ సంపత్ రాజ్. ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్న సంపత్ రాజ్ ఆ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో పెద్ద సినిమాల్లో విలన్ గా నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక తాజాగా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న సంపత్ రాజ్ గారు రీసెంట్ గా జీ ఓటిటి కోసం నటించిన ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్ లో నటించారు.

ఈ వెబ్ సిరీస్ కోసం ప్రొమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్న తాను పాప పుట్టాక కలిసి ఉండలేమని నిర్ణయించుకుని విడిపోయామని తెలిపారు. పాప తన వద్దే ఉండాలని కస్టడీ తీసుకుని పెంచిన ఆయన తన కూతురు ఒప్పుకోకపోతే తాను నటుడిని అయ్యేవాడిని కాదు అంటూ తెలిపారు.

తన కూతురు నేను విడాకులు తీసుకునే సమయానికి చిన్న పాప అదే సమయంలో తనకు సినిమాలో అవకాశం రావడంతో ఏమి చేయాలో తెలియని సమయంలో తనతో మాట్లాడి బోర్డింగ్ స్కూల్ లో నువ్వు ఐదేళ్ళు ఉంటే నేను నటుడుగా నిలాదొక్కుకుంటాను ఆ తరువాత నిన్ను బయటికి తీసుకుని వస్తాను నీ ఐదేళ్ళు నాకోసం ఇస్తావా అని అడిగితే తనకు అంత చిన్న వయసులో ఏమర్థమైందో తెలియదు కానీ బోర్డింగ్ స్కూల్ కి వెళ్లింది.

తన పదో తరగతి వరకూ అక్కడే ఉండి ఆపైన (Sampath Raj) నా దగ్గరికి వచ్చింది. నా భార్యతో విడాకులు తీసుకున్నాను, ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటాను. మా అభిప్రాయాలు వేరవడం వల్ల విడిపోయాను కానీ స్నేహితులుగా ఉన్నాం. నా బిడ్డ తన తల్లితో టచ్ లోనే ఉంది. ప్రస్తుతం నా కూతురు మెలబోర్న్ లో ఉద్యోగం చేస్తోంది అంటూ తనకు సినిమాల మీద ఆసక్తి లేదని తెలిపిన ఆయన సమాజ సేవ మీద ఎక్కువ ఆసక్తి ఉందని, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం తాను పనిచేస్తోందని తెలిపారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus