2019 సెప్టెంబర్లో వచ్చిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తర్వాత నాని సినిమా థియేటర్లలో విడుదలై 2 ఏళ్ళు దాటింది. ‘వి’ ‘టక్ జగదీష్’ వంటి సినిమాలు ఓటిటికే పరిమితమయ్యాయి. పైగా ఈ రెండు సినిమాల కారణంగా నాని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ‘టక్ జగదీష్’ ఓటిటికి వెళ్లడం పై డిస్ట్రిబ్యూటర్లు నిరసనకి దిగారు. ఓ సినిమా వేడుకలో సినిమా థియేటర్ల గొప్పతనం గురించి అంత గొప్పగా చెప్పిన నాని తన సినిమాని మాత్రం ఓటిటికి ఇవ్వడం ఏంటి అంటూ తప్పుబట్టారు.
నాని కూడా తన సినిమా ఓటిటికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదని నిర్మాతలు శ్రేయస్సుకొరకు తప్పడం లేదని చెప్పినా వారు వినలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ప్రస్తుతం నానికి ఓ హిట్ పడితేనే వీటన్నిటి నుండీ రిలీఫ్ దొరుకుతుంది. ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్ చూస్తుంటే హిట్టు పడేలానే ఉంది. కానీ నాని సినిమాకి రూ.30కోట్ల నుండీ రూ.35 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. కాబట్టి రూ.40 నుండీ రూ.50 కోట్లు షేర్ మార్క్ ను ఆ సినిమా అందుకుంటేనే అటు నానికి
కానీ ఇటు ఇండస్ట్రీకి కానీ పెద్ద రిలీఫ్ దక్కుతుంది. ఇంకా ఏపీలో టికెట్ రేట్ల ఇష్యు ఓ కొలిక్కి రాలేదు. పైగా ‘గని’ సినిమాతో కూడా నాని పోటీ పడాల్సి ఉంది. వీటన్నిటినీ అధిగమించి నాని ‘శ్యామ్ సింగరాయ్’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!