మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా ‘భీమా’ (Bhimaa) అనే సినిమా వచ్చింది. కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష (Harsha) తెరకెక్కించిన సినిమా ఇది. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. ఈ రోజుల్లో మొదటి షోకి మిక్స్డ్ టాక్ వస్తే.. నెక్స్ట్ షోకి జనాలు ఉండటం లేదు. గోపీచంద్ కి ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేదు. అలాంటప్పుడు.. గోపీచంద్ సినిమాలకి ఇలాంటి టాక్ వస్తే.. ఆ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అంచనాల వేయొచ్చు. ‘భీమా’ విషయంలో ఇలాగే జరగాలి.
కానీ శివరాత్రి సెలవు ఉండటం. ఆ తర్వాత శని, ఆదివారాల వల్ల .. కొంతవరకు డీసెంట్ షేర్స్ ను రాబట్టినట్లు అయ్యింది. సోమవారం నుండి ‘భీమా’ నిలబడటం కష్టం అని ట్రేడ్ పండితులు గట్టిగా చెప్పారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వీక్ డేస్ లో కూడా ‘భీమా’ బాగా కలెక్ట్ చేస్తుంది. ప్లాప్ టాక్ వచ్చిన పెద్ద సినిమాలకి కూడా 7 వ రోజు 50 లక్షలు గ్రాస్ ఉండటం కష్టం.
అలాంటిది ‘భీమా’ సినిమా 7 వ రోజున రూ.75 లక్షల పైనే గ్రాస్ ను, రూ.42 లక్షల వరకు షేర్ ను రాబట్టింది. చెప్పుకోడానికి ఇవి చాలా మంచి నంబర్స్. గోపీచంద్ కి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉందని ఈ సినిమా ప్రూవ్ చేసింది. కానీ పూర్తిగా నష్టాల నుండి తప్పుకునే అవకాశాలు అయితే ‘భీమా’ కి లేవు. ఒక వేళ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ బాగున్నాయి అని అనిపిస్తే.. మేకర్స్ వెంటనే సక్సెస్ మీట్ లాంటిది పెట్టి.. జనాల్లోకి సినిమాని ఇంకా తీసుకెళ్లాలి.
కానీ ‘భీమా’ టీం అలా చేయలేదు. మొదటి వారం కంప్లీట్ అయ్యాక థాంక్స్ మీట్ పెట్టింది. అది కూడా శుక్రవారం పూట బోలెడన్ని సినిమాలు రిలీజ్ ఉండగా..! ఇలాంటి ప్రమోషన్స్.. రిలీజ్ కి ముందు చేసి ఉంటే ఓపెనింగ్స్ బాగా వచ్చేవి. వీక్ డేస్ కలెక్షన్స్ తో సినిమా సేఫ్ అయ్యేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకున్నా.. జస్ట్ యావరేజ్ ఫలితంతోనే సరిపెట్టుకుంటుంది.