వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన సినిమా ‘ఎఫ్3’. గతంలో వచ్చిన ‘ఎఫ్2’ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్3’ని తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమందికి ఈ సినిమా నచ్చింది.. కొందరికి నచ్చలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.24 కోట్ల షేర్ ని రాబట్టిందని తెలుస్తోంది.
ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ.. ఈరోజు నుంచి ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఎంత పెద్ద సినిమా అయినా.. సోమవారం వచ్చిందంటే థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గుతుంది. ‘ఎఫ్3’ సినిమాకి కూడా ఆక్యుపెన్సీ తగ్గడం ఖాయం. కాకపోతే ఈవెనింగ్ షోలు, సెకండ్ షోలకు జనాలు వస్తే సినిమా కోలుకుంటుంది. లేదంటే వచ్చే వారం మరో సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. సాయంత్రం షోలు పికప్ అయినప్పటికీ.. సాధారణ టికెట్ రేట్లతో ఏ మేరకు రికవర్ అవుతుందనేది చూడాలి.
ఈ సినిమాకి సాధారణ టికెట్ రేట్లు మాత్రమే ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. కానీ అంతకంటే తక్కువ టికెట్ రేట్లకు ‘మేజర్’ సినిమాను శుక్రవారం నాడు రిలీజ్ చేస్తున్నారు. టికెట్ రేట్ల సంగతి పక్కన ‘ఎఫ్3’కి ప్రధానమైన పోటీ ‘మేజర్’ సినిమానే. యూనిట్ చెబుతున్న లెక్కల ప్రకారం.. ‘ఎఫ్3’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు యాభై శాతం బ్రేక్ ఈవెన్ సాధించిందట.
సో.. మిగిలిన డబ్బులు కూడా రావాలంటే మరో వీకెండ్ ఈ సినిమా ఆడాల్సి ఉంటుంది. ఎక్కువ కలెక్షన్స్ ను రాబడితేనే ‘ఎఫ్4’ సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. మరేం జరుగుతుందో చూడాలి!