ప్రేమ్ రక్షిత్.. ‘ఆస్కార్’ అవార్డు గెలుచుకున్న తెలుగు పాట ‘నాటు నాటు’ కి కొరియోగ్రాఫర్. ఈ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అందుకుంది అంటే ఈయన కొరియోగ్రఫీ చాలా కీలక పాత్ర పోషించింది అని చెప్పాలి. చరణ్- ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచమంతా రీల్స్ చేసింది. రాజమౌళి- ప్రేమ్ రక్షిత్ కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ‘ఛత్రపతి’ సినిమాతో ప్రేమ్ ను రాజమౌళి పరిచయం చేశాడు.
ఆ సినిమాలో ‘గల గల గజ్జెల’ అనే పాటను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడు. అటు తర్వాత ‘ నాచోరే నాచోరే’ ‘బంగారు కోడిపెట్ట’ వంటి పాటలను కూడా చార్ట్ బస్టర్స్ చేశాడు. అయితే 2014 తర్వాత ఈయన హవా తగ్గింది. పెద్ద సినిమాల్లో ప్రేమ్ కు అవకాశాలు కరువయ్యాయి. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వచ్చాక చాలా వరకు ప్రేమ్ రక్షిత్ ను పక్కన పెట్టారు దర్శకనిర్మాతలు.దీంతో ‘ఇతను ఫేడౌట్ అయిపోయాడు’ అనే కామెంట్లు కూడా ఎక్కువయ్యాయి.
కానీ రాజమౌళి మాత్రం తన సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తూనే ఉన్నాడు. అందరూ పక్కన పెట్టినట్లు రాజమౌళి కూడా ప్రేమ్ ను పక్కన పెట్టుంటే ‘ ‘నాటు నాటు’ పాట ఎలా ఉండేదో.. అతను కాకుండా వేరే వ్యక్తి కొరియోగ్రఫీ చేసుంటే ‘ఆస్కార్’ వచ్చేదో లేదో’ వంటి అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా… ప్రేమ్ రక్షిత్ తెలుగువాడు కాదన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు.
ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఇతని అసలు పేరు కూడా థామస్ సతీష్. వీళ్ళ ఫ్యామిలీ అంతా క్రైస్తవ మతం స్వీకరించి క్రైస్తవులుగా మారారు. ఇతన్ని ఓ కొరియోగ్రాఫర్ కూడా తొక్కేయాలని చూశాడు. కానీ రాజమౌళి సాయంతో టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. ఆస్కార్ రావడం వల్ల ప్రేమ్ రక్షిత్ కు పూర్వ వైభవం లభిస్తుంది. మళ్ళీ ఇతనికి పెద్ద సినిమాల్లో ఆఫర్లు లభిస్తున్నాయి.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?