వారసులకు.. స్టార్లు ఎలాంటి సాయం అయినా చేయవచ్చు. చేయాలి కూడా..! కానీ తమ కెరీర్ ని రిస్క్ లో పెట్టేలా, అభిమానుల ఆశలపై నీళ్లు జల్లేలా.. ఏమీ చేయకూడదు. ఇది రజినీకాంత్ కి వంద శాతం యాప్ట్ అయ్యే లైన్ అనే చెప్పాలి. ఎందుకు అంటారా? గతేడాది ‘జైలర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి.. సూపర్ ఫామ్లోకి వచ్చారు రజినీకాంత్. దీంతో ఆయన అభిమానులను సంతృప్తి చెందడమే కాకుండా.. సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఇంతలోనే ‘లాల్ సలాం’ అనే సినిమా వచ్చింది.
ఇందులో రజనీకాంత్ స్పెషల్ రోల్ చేశారు. కాదు కాదు.. ముఖ్య పాత్ర పోషించారు. రజినీకాంత్ నటించడం వల్ల ఈ సినిమాకి ఎక్స్ట్రా మైలేజ్ యాడ్ అయ్యింది అంటూ ఏమీ లేదు. పైగా ఆయన ఇమేజ్ కే ఎసరు పెట్టింది ‘లాల్ సలాం’. ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. ‘ఇలాంటి పాత్ర ఎందుకు రజినీకాంత్ చేశారు?’ అంటూ ఫ్యాన్స్ నెత్తి కొట్టుకుంటున్నారు. దానికి ఒక్కటే సమాధానం.
ఐశ్వర్య రజినీకాంత్. రజినీకాంత్ పెద్ద కూతురే ఈ చిత్రానికి దర్శకురాలు. అందుకే రజినీకాంత్ కాదనలేక చేశారు. పోనీ రజినీకాంత్ ఇమేజ్ కి మ్యాచ్ అయ్యేలా ఈ సినిమాలో ఆమె ఏమైనా స్ట్రాంగ్ ఎలివేషన్స్ ఇచ్చిందా అంటే అదేమీ లేదు. సినిమాలో రజినీకాంత్ ని సహాయ నటుడు లాంటి పాత్రలో చూపించి నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి ఓపెనింగ్స్ అయినా భారీగా వచ్చే ఛాన్స్ ఉందా అంటే.. అలాంటిది ఏమీ జరగలేదు.
తమిళంలో కూడా ఈ సినిమా మినిమం ఇంపాక్ట్ చూపలేదు. తెలుగు సంగతి అస్సలు చెప్పనవసరం. కనీసం రూ.10 లక్షల షేర్ ను కూడా ‘లాల్ సలాం’ రాబట్టలేకపోయింది. మొదటి రోజు చాలా చోట్ల షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. రజినీకాంత్ కెరీర్ లో 2014 లో వచ్చిన ‘కొచ్చాడియాన్’ మాత్రమే దారుణమైన ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ‘లాల్ సలాం’ (Lal Salaam) దాని రికార్డుని కూడా బ్రేక్ చేసింది అని చెప్పాలి