10వ వారం నామినేషన్స్ అనేవి హీట్ ఎక్కాయి. రాజమాత వర్సెస్ ప్రజలు నామినేషన్స్ లో ప్రజలు ఇద్దరిని నామినేట్ చేయడానికి ఎంచుకోవాలి. హౌస్ లో ఉన్న ఫిమేల్ కంటెస్టెంట్స్ నలుగురు రాజమాతలుగా మారతారు. వాళ్లు ఏకాభిప్రాయంతో నామినేట్ అయిన ఇద్దరిలో నుంచీ ఒకరిని వాళ్లు నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అర్జున్ కి – గౌతమ్ కి శివాజీకి ఈ ముగ్గురికీ గట్టిగా వాదనలు జరిగాయ్. అలాగే భోలే షవాలికి , అమర్ కి కూడా ఒక రేంజ్ లో గొడవ అయ్యింది.
పల్లవి ప్రశాంత్ కూడా తన పాయింట్స్ ని గట్టిగానే చెప్పాడు. ఈ రకమైన నామినేషన్స్ జరగడం అనేది ఈ సీజన్ లో రెండోసారి. నాలుగోవారం నామినేషన్స్ లో జడ్జిలుగా హౌస్ మేట్స్ వ్యవహరించి హౌస్ మేట్స్ ని బోన్ లో పెట్టి నామినేట్ చేశారు. ఇప్పుడు రాజమాతలు నామినేట్ అయినవాళ్ల నుంచీ ఒకరిని సేఫ్ చేసి ఒకరిని నామినేట్ చేశారు. అయితే, ఇక్కడ హౌస్ మేట్స్ చాలా పాయింట్స్ పై ఆర్గ్యూమెంట్స్ చేస్కున్నారు.
ఫైనల్ గా ఐదుగురు నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా సమాచారం. గౌతమ్ , భోలే, శివాజీ, రతిక , యావర్ ఈ ఐదుగురు ఈవారం నామినేషన్స్ లిస్ట్ లోకి వచ్చారు. అంతేకాదు, ఫైనల్ గా అమర్ ఈవారం సేఫ్ అయ్యాడు. రాజమాతలు అమర్ పై చెప్పిన పాయింట్స్ కి ఎక్కడా కూడా కన్విన్స్ కాలేదు.
అలాగే, రాజమాతల్లో నుంచీ రతిక కూడా నామినేట్ అయ్యింది. ఇక్కడ భోలే, గౌతమ్, రతిక ఈ ముగ్గురూ డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక రాజమాతలుగా ప్రియాంక, శోభాశెట్టి, రతిక, ఇంకా అశ్విని నలుగురు మద్యలో కూడా బేధాబిప్రాయాలు వచ్చాయ్. శివాజీ, భోలే ఇద్దరూ ఉన్నప్పుడు చాలాసేపు తర్జన భర్జన చేశారు.
కంటెండర్ షిప్ పోగొట్టుకున్న కారణంగా, అలాగే గతవారం జరిగిన టాస్క్ లో బ్లాక్ బాల్ ని వదిలేసిన కారణంగా భోలే షవాలిని నామినేషన్స్ లోకి తీస్కుని వచ్చారు రాజమాతలు. ఇలా వాళ్ల కారణాలు చెప్తూ జెన్యూన్ గానే జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదీ మేటర్.