రజినీకాంత్ కు దర్శకుడు బాలచందర్ క్లాస్ పీకిన వేళ..!

రజినీకాంత్- కమల్ హాసన్ తమిళ సినీ పరిశ్రమని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన స్టార్లు. అయితే వీళ్ళకి లైఫ్ ఇచ్చింది మాత్రం లెజెండరీ దర్శకుడు కె.బాలచందర్ అనే చెప్పాలి. కెరీర్ ప్రారంభంలో రజనీ- కమల్.. కలిసి చాలా చిత్రాల్లో నటించారు. అయితే వాళ్ళకి స్టార్ డం వచ్చిన తర్వాత కలిసి నటించడం మానేశారు. ఇదిలా ఉండగా..రజనీ కాంత్- కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రాల్లో 1976 లో వచ్చిన ‘మూండ్రు ముడిచ్చు’ కూడా ఒకటి.

ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ రోజు షూటింగ్ లో కాస్త గ్యాప్ ఇచ్చి బయటకు వెళ్లారు దర్శకుడు కె.బాలచందర్. ఆ క్రమంలో కమల్ హాసన్ సిన్సియర్ గా సీన్ కోసం ప్రిపేర్ అవుతుండగా… అదే టైంలో రజినీకాంత్ బయటికి వెళ్లి సిగరెట్ కాల్చుకుంటున్నారు. ఇది గమనించిన దర్శకుడు కె.బాలచందర్… రజినీకాంత్ ను పిలిచి క్లాస్ పీకారట. ‘కమల్ ను చూసి నేర్చుకో. వాడు ఓ రోజు కచ్చితంగా స్టార్ హీరో అవుతాడు.

నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు.. జీవితంలో పైకి రావాలనుకుంటున్నావా? లేదా’ అని తిట్టారట. కమల్- రజనీ హీరోలుగా నటిస్తున్న టైములో.. మొదట కమల్ హాసన్ ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్నారు. కానీ అటు తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా రజినీకాంత్ సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆ టైంలో ఓసారి రజినీకాంత్, కమల్ ఓ వేడుకలో పాల్గొనగా అక్కడికి బాలచందర్ గెస్ట్ గా వెళ్లారట. ఆ సమయంలో కూడా రజినీకాంత్ వెళ్లి బాలచందర్ కాళ్ళ పై పడి ఆశీర్వాదం తీసుకున్నారు.

అయితే ఆ సమయానికి కమల్ వేదిక పై ఉన్నారట. ఆయన కిందకి రాగానే బాలచందర్ కమల్ ని గట్టిగా హత్తుకున్నారట. కమల్ హాసన్ కళను గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు.. రజనీ అయితే సాటి వారినందరినీ ప్రేమిస్తాడు. వీరిద్దరిలో గొప్ప లక్షణం అదే. ‘కమల్ గొప్ప నటుడు, రజనీ గొప్ప స్టార్’ అని సందర్భంలో వీరిద్దరి గురించి బాలచందర్ చెప్పుకొచ్చారు. ‘ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు’ అని కూడా బాలచందర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus