SSMB28: మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి అలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా?

మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో రికార్డులు అయితే క్రియేట్ చేయలేదు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి అమ్మకథ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే ఈ టైటిల్ పై మహేష్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి ఇలాంటి టైటిల్ కరెక్ట్ కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే మేకర్స్ నుంచి క్లారిటీ వస్తే మాత్రమే ఈ సినిమా టైటిల్ విషయంలో కన్ఫ్యూజన్ కు తెరపడే ఛాన్స్ ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ ఇద్దరు హీరోయిన్లకు సమానంగా ప్రాధాన్యత ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. మహేష్ గత సినిమాలన్నీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా మహేష్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ ఈ సినిమా కోసం 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ రేంజ్ సినిమా సినిమాకు పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటించనున్నారు. మహేష్ తో రాజమౌళి తెరకెక్కించే సినిమా మామూలుగా ఉండదని ప్రపంచ దేశాల ప్రజలకు నచ్చే కథాంశాన్ని జక్కన్న కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు. మహేష్ విదేశాల్లో అభిమానులను పెంచుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ తెలుగు నేటివిటీతో ఉంటుందని సమాచారం. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus