టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన, శిల్పి మన జక్కన్నకు మరో అరుదైన ఘనత సాధించారు. ‘బాహుబలి’ లాంటి సినిమాతో తెలుగు సినిమా సత్తాను దేశవ్యాప్తంగా చాటిచెప్పారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఇండియన్ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడమే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుందీ మూవీ. అంతే కాదు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈ సినిమా పేరు కొన్ని నెలలు పాటు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది.
దర్శకుడు రాజమౌళికి (Rajamouli) అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. అయితే ఇప్పుడు రాజమౌళి మరో ఘనత సాధించారు. టైమ్స్ మ్యాగిజైన్ ప్రకటించిన ‘టాప్-100 వరల్డ్ ఇన్ల్ఫూయెన్షిల్ పీపుల్’ జాబితాలో రాజమౌళికి చోటు దక్కింది. ఇది తెలుగు వారంతా హర్షించదగ్గ విషయం. రాజమౌళికి ఇలాంటి ఘనత దక్కడంతో మరోసారి ప్రపంచం చూపు టాలీవుడ్ పై పడింది. 2023 ఏడాదికి గానూ టైమ్స్ నిర్వహించిన ఈ పోలో లో ఓ తెలుగు దర్శకుడు చోటు దక్కించకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
దీంతో రాజమౌళి పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. రాజమౌళికి ఇలాంటి ఘనత దక్కడంతో బాలీవుడ్ నటి అలియా భట్ రాజమౌళి గురించి చెప్పుకొచ్చింది. భిన్న సంస్కృతులు ఉన్న ఈ సువిశాల భారతదేశాన్ని ఒక్క సినిమాతో ఒక్కటి చేసి చూపించారని రాజమౌళి గురించి వివరించింది అలియా
ఆయనకు ప్రశంసల వర్షం కురుస్తోంది.
రాజమౌళితో పాటు ఇండియాకు సంబంధించిన పలువురు సెలబ్రెటీలు కూడా ఈ టాప్ 100 లిస్ట్ లో చోటుదక్కించుకున్నారు. అందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, న్యాయనిర్ణేత పద్మలక్ష్మీ భారత్ నుంచి ఈ జాబితాలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కింగ్ చార్లెస్, ఎలాన్ మస్క్, సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తదితర ప్రముఖులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.