ఏఎన్నార్ – ప్రభాస్ ఇద్దరు సాధించిన ఆ అరుదైన ఘనత ఏంటంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటి నటరత్న ఎన్టీఆర్, నటసామ్రాట్ ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణం రాజు తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ వరకు ఎవరికి వారిది సపరేట్ స్టైల్.. ఫ్యాన్ బేస్, మార్కెట్, రికార్డ్స్.. కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు రాబట్టడం..

అత్యధిక సెంటర్లలో, అత్యధిక రోజులు ఆడడం దగ్గరి నుండి ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు.. బ్లాక్ బస్టర్స్, సూపర్ డూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టారీ హీరోలు.. అయితే ఎవరికీ సాధ్యం కాని, చరిత్రలో నిలిచిపోయే సెన్సేషన్ క్రియేట్ చేసింది మాత్రం.. నటసామ్రాట్ ఏఎన్నార్, రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రమే.. ఇంతకీ వీరిద్దరు సాదించిన ఆ అరుదైన ఘనత ఏంటో తెలుసా?.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా హీరోలు, దర్శక నిర్మాతలు చేసే ప్రతి చిత్రం విజయం సాధించాలనుకునే తెరకెక్కిస్తుంటారు.. కొన్ని సార్లు అనుకున్న దానికంటే ఎక్కువ హిట్ కావడం, కొన్ని సార్లు అంచనాలు తలకిందులవడం జరుగుతుంటుంది.. వరుసగా హిట్స్, హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ కొట్టిన కథానాయకులు ఉన్నారు కానీ వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన హీరోలు మాత్రం ఎవరూ లేరు.. ఆ రేర్ ఫీట్ అక్కినేని, ప్రభాస్ ఇద్దరి ఖాతాలో ఉంది..

ఏఎన్నార్ నటించిన ‘బాలరాజు’ (1948) అప్పట్లో ఇండస్ట్రీ హిట్.. తర్వాత ఏడాది ‘కీలుగుర్రం’ (1949) కూడా ఇండస్ట్రీ హిట్.. ప్రభాస్ ‘బాహుబలి : ది బిగినింగ్’ (2015) ఇండస్ట్రీ హఇట్.. ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ కూడా ఇండస్ట్రీ హిట్ (2017).. ఇలా వరుసగా రెండు సినిమాలతో ఈ ఘనత సాధించింది నాగేశ్వర రావు, ప్రభాస్ ఇద్దరే కావడం విశేషం..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus