పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమా నుంచి తాజాగా పవర్ గ్లాన్స్ పేరుతో ఒక వీడియో విడుదల కాగా ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చెప్పిన సమయం కంటే ముందుగానే ఈ వీడియో రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా పవన్ లుక్ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
రీఎంట్రీలో వరుసగా విజయాలను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్రిష్ సైతం గతంలో హరిహర వీరమల్లు మూవీ చరిత్ర సృష్టిస్తుందని వెల్లడించడం గమనార్హం. 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రముఖ నిర్మాతలలో ఒకరైన ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా పవన్ ఫ్యాన్స్ పవన్ ఫోటోలను సోషల్ మీడియాలో డీపీలుగా పెట్టుకున్నారు.
లక్షల సంఖ్యలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినిమా నటుడిగా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ రాజకీయాలలో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్న, వదిన ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే పవన్ కు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డు ఉంది. పవన్ నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా, సింగర్ గా, డ్యాన్స్ మాస్టర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, స్టంట్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఈ జనరేషన్ హీరోలలో మరే నటుడు పవన్ కు మాత్రమే సాధ్యమైన ఈ అరుదైన రికార్డ్ ను బ్రేక్ చేయడం సులువు కాదు. పవన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!