Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » నవరస నటనా వారసుడు నాగ్ మన యువ సామ్రాట్

నవరస నటనా వారసుడు నాగ్ మన యువ సామ్రాట్

  • August 27, 2016 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవరస నటనా వారసుడు నాగ్ మన యువ సామ్రాట్

అక్కినేని నాగేశ్వరరావు అభిమానుల ఆశలను అనుగుణంగా నాగార్జున తన తండ్రి పోషించిన ప్రేమికుడు, భక్తుడి పాత్రలతో రాణించి క్లాస్ ప్రేక్షకుల్లో, మహిళల్లో అభిమానులను సంపాదించుకున్నారు. యాక్షన్ హీరోగానూ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినీ జీవితంలో 30 ఏళ్లు పూర్తిచేసుకున్న నాగ్ వందో చిత్రానికి అతి చేరువలో ఉన్నారు. నేడు (ఆగస్టు 29) పుట్టినరోజు జరుపుకుంటున్న కింగ్ నాగార్జునకు ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఆయన టాప్ టెన్ చిత్రాల గురించి…

1. గీతాంజలి (1989)Geethanjali, Nagarjuna, Ngarjuna Movies

అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా నాగార్జున చిత్రపరిశ్రమకు వచ్చిన తొలి నాళ్లలోనే నిరూపించుకున్నారు. విషాదాంత ఇతివృత్తంతో మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి మూవీ దేవదాసుని గుర్తుచేసింది. ఇందులోని డైలాగులు అప్పటి యువతను కట్టిపడేసింది. నాగ్ సహజమైన నటనతో అమ్మాయిల మనసు దోచుకున్నారు.

2. శివ (1989)Nagarjuna, Ngarjuna Moviesతెలుగు సినిమా గతిని మలుపు తిప్పిన సినిమా శివ. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాగార్జునను చూపించిన విధానం కుర్రకారుకి బాగా నచ్చింది. ఈ చిత్రంతో యాక్షన్ హీరోగా మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. శివ అనే పేరు వినగానే సైకిల్ చైన్ పట్టుకున్న నాగ్ స్టైల్ అందరీ కళ్ళముందు కదలాడుతుంది. అంతగా ప్రభావితం చేసింది ఈ సినిమా.

3. హలో బ్రదర్ (1994)Nagarjuna, Ngarjuna Moviesనాగార్జునలోని కామెడీ యాంగిల్ ని బయట పెట్టిన చిత్రం హలో బ్రదర్. ఇందులో క్లాస్, మాస్ హీరోలుగా నాగ్ నవ్వుల వాన కురిపించారు. హాలీవుడ్ మూవీ ట్విన్ డ్రాగన్ చిత్రం ఆధారంగా ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది.

4. నిన్నే పెళ్లాడుతా (1996)Nagarjuna, Ngarjuna Moviesనాగార్జునను ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరి చేసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. ఇందులో లవర్ బాయ్ గా కనిపిస్తూ, కుటుంబ సభ్యులతో గ్రీకువీరుడు చేసిన సందడి అందరికీ నచ్చింది. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను చక్కగా చూపించి నాగ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు.

5. అన్నమయ్య (1997)Nagarjuna, Ngarjuna Moviesఎన్నో కమర్షియల్ హిట్ చిత్రాలు ఇచ్చిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు, గ్రీకువీరుడిగా పేరుతెచ్చుకున్న నాగార్జున కలిసి చేసిన చిత్రం అన్నమయ్య. చిత్రం ప్రకటన చేసినప్పటి నుంచి విమర్శలను ఎదుర్కొన్న ఈ సినిమా అపూర్వ విజయం సాధించింది. నాగ్ భక్తుడిగా తన నటనతో విమర్శకుల నోళ్లను మూయించారు.

6. సంతోషం (2002)Nagarjuna, Ngarjuna Moviesస్టార్ హీరో స్థాయికి వచ్చినప్పుడు అభిమానుల అంచనాలకు తగినట్లు సినిమాను ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ప్రయోగాలకు ముందు ఉండే నాగార్జున స్టార్ హోదాను ఆలోచించకుండా.. కథే హీరో అనుకోని చేసిన సినిమా సంతోషం. ఫైట్లు బిల్డప్ లు లేకుండా ఎంతో సాఫ్ట్ గా సాగిపోతూ మహిళా ప్రేక్షకుల జేజేలు అందుకుంది.

7. మన్మధుడు (2002)Nagarjuna, Ngarjuna Moviesసంతోషం ఇచ్చిన ఉత్సాహంతో కామెడీ డోస్ పెంచి ప్రేమ కథను మేళవించి త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయ్ భాస్కర్ లు నాగార్జునకు ఇచ్చిన ట్రీట్ మన్మధుడు. టాలీవుడ్ మన్మధుడు నాగార్జునే అంటూ తెలుగు ప్రజలు ఈ మూవీని సూపర్ హిట్ చేశారు. ఎన్ని సార్లు చుసిన ఈ చిత్రం బోర్ కొట్టదు.

8. మాస్ (2004)Nagarjuna, Ngarjuna Moviesశివ సినిమా తర్వాత నేటి తరానికి నచ్చే యాక్షన్ తో నాగ్ చేసిన సినిమా మాస్. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ డైరక్టర్ గా ఈ చిత్రం తో పరిచయమయ్యారు. నాగార్జున చాలా కాలం తర్వాత ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ తో మాస్ లో మెప్పించారు. అన్న నడిచొస్తే మాస్ అనే పాట ఆ ఏడాదంతా మారుమోగింది.

9. మనం (2014)Nagarjuna, Ngarjuna Moviesకథను ఎంపిక చేసుకోవడంలో నాగార్జున అభిరుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదని చాటిన చిత్రం మనం. అక్కినేని కుటుంబానికి సరిపోయే స్టోరీని ఎంపిక చేసుకుని తండ్రి ఏఎన్ఆర్, కొడుకు నాగ చైతన్యతో కలిసి నటించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీనిని అక్కినేని అభిమానులు మరిచిపోని విధంగా దర్శకుడు విక్రమ్ కుమార్ మలిచారు.

10. ఊపిరి (2016)Oopiri Movieకేవలం చక్రాల కుర్చీలో కూర్చొనే నాగార్జున నవరసాలు పండించి సినిమాకు ఊపిరి పోశారు. యువ నటుడు కార్తీ తో స్క్రీన్ ని పంచుకొని మరో మరుపురాని చిత్రాన్ని తన ఖాతాల్లో వేసుకున్నారు. స్టార్ హీరో అంటే ఒకే చట్రంలో ఇరుక్కోకూడదని “ఊపిరి” ద్వారా నాగ్ యువ కథానాయకులకు చాటి చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Geethanjali Movie
  • #Manam Movie
  • #Manmadhudu
  • #Mass Movie

Also Read

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

related news

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

trending news

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

44 mins ago
55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

4 hours ago
Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

5 hours ago
రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

20 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

21 hours ago

latest news

Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

5 hours ago
‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

5 hours ago
Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

1 day ago
Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

1 day ago
Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version