‘మిర్చి’ (Mirchi) ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘భరత్ అనే నేను’ (Bharath Ane Nenu)వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ (Koratala Siva) . దీంతో అతని డైరెక్ట్ చేసే సినిమాలు.. ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకతని సంతరించుకుంటున్నాయి. అయితే ‘ఆచార్య’ (Acharya)… కొరటాలకి పెద్ద షాకిచ్చింది. ఆ సినిమా ఫలితం వల్ల.. కొరటాలతో సినిమా చేయాలనుకున్న కొంతమంది స్టార్ హీరోలు కూడా వెనక్కి తగ్గారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ధైర్యం చేసి ‘దేవర’ (Devara) చేశాడు.
Koratala Siva
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనిపించే టాక్ ను రాబట్టుకుంది. ట్విట్టర్లో వచ్చిన నెగిటివ్ టాక్ ను పక్కన పెడితే.. ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను రాబడుతుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఓ విషయంలో మాత్రం కొరటాల బాగా డిజప్పాయింట్ చేశాడు అని చెప్పాలి. అదేంటంటే.. కొరటాల శివ సినిమాల్లో ఓ సామాజిక బాధ్యత కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు డిజైన్ చేస్తాడు.
కథని ముందుకు నడిపించే విధంగానే కొరటాల సినిమాల్లో హీరోయిన్లు కనిపిస్తారు. ‘ఆచార్య’ లో హీరోయిన్ లేదు. పూజా హెగ్డే (Pooja Hegde) ఉన్నా లేనట్టే..! అయితే ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్ర కొంచెం వల్గర్ గా కనిపించింది అని అంతా అంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఫ్రెండ్స్ పలికే డబుల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే విధంగా ఉన్నాయి. ‘మామగారు తండ్రితో సమానం’ అని భావించే సంస్కృతి మనది.
కానీ ఈ సినిమాలో హీరోయిన్ ‘మామగారిని పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ పలకడం’ ‘చాపెక్కిన ఏడాదికే పెళ్లి చేసుకున్నావ్.. నీకేం తెలుస్తుంది మా అమ్మాయిల బాధ.. రోత’ అంటూ హీరోయిన్ ఫ్రెండ్స్ పలకడం చాలా ఘోరంగా ఉన్నాయి. నిజజీవితంలో రెస్పాన్సిబిలిటీస్ గురించి, జవాబుదారీతనం గురించి గొప్పగా చెప్పే కొరటాల పెన్ నుండి ఇలాంటి డైలాగులు రావడం నిజంగా విషాదకరమే అని చెప్పాలి..!