యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయాల్లోకి రావాలని చాలామంది అభిమానుల ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర (Devara) సినిమా రిలీజ్ సమయంలో సైతం పలు థియేటర్ల దగ్గర తారక్ అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం నెట్టింట హాట్ టాపిక్ అయింది. అయితే దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పొలిటికల్ ఎంట్రీ గురించి తారక్ పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చేశారు.
Jr NTR
తాను కెరీర్ పరంగా నటుడిని కావాలని అనుకున్నానని తారక్ తెలిపారు. 17 సంవత్సరాల వయస్సులో తాను తొలి సినిమాలో నటించానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. అప్పటినుంచి నా దృష్టి యాక్టింగ్ వైపు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఓట్ల సంగతి పక్కన పెడితే ఫ్యాన్స్ నా కోసం మూవీ టికెట్లు కొంటున్నారని ఇంతమంది ప్రజలను తాను కలుస్తున్నానని తారక్ తెలిపారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తోందని తారక్ తెలిపారు.
ప్రస్తుతం యాక్టర్ గా సంతోషంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ కొంతమంది అభిమానులను మాత్రం నిరాశకు గురి చేస్తుండటం గమనార్హం. భవిష్యత్తులో రాజకీయాల గురించి ఆలోచిస్తానేమో అని తారక్ చెప్పి ఉంటే బాగుండేదని మరి కొందరు సూచిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తారక్ ఆలోచనలు సైతం మారతాయేమో చూడాల్సి ఉంది.
ఏపీలో టికెట్ రేట్ల పెంపు దేవర సినిమాకు ఎంతగానో కలిసొచ్చింది. టికెట్ రేట్ల పెంపు వల్ల దేవర కలెక్షన్లు అంచనాలకు మించి కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. దేవర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో 350 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాలి.