Okkadu Movie: ఆ మార్పులు చేయడం వల్లే మహేష్ మూవీ బ్లాక్ బస్టర్ అయిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు మహేష్ బాబును ఎంతగానో అభిమానిస్తారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు తన రేంజ్ కు తగిన కథలను ఎంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. గత కొన్నేళ్లుగా మహేష్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా సక్సెస్ సాధిస్తోంది.. మహేష్ బాబు సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒక్కడు మూవీ ఒకటి కాగా ఈ మూవీ సక్సెస్ తో మహేష్ బాబుకు మాస్ ప్రేక్షకుల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

అయితే స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులు ఈ సినిమా (Okkadu Movie) సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు కాగా గుణశేఖర్ మొదట అనుకున్న కథ ప్రకారం కొండారెడ్డి బురుజు దగ్గర ఓబుల్ రెడ్డిని హీరో పాత్ర కొట్టే సీన్ స్టార్టింగ్ లో రావాలి. ఆ తర్వాత కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. అయితే పరుచూరి గోపాలకృష్ణ ఆ సీన్ అక్కడ పెట్టడం కరెక్ట్ కాదని సినిమా స్టార్టింగ్ లో అంత పవర్ ఫుల్ సీన్ పెట్టవద్దని సూచనలు చేశారు.

గుణశేఖర్ సైతం ఆ సూచనల ఆధారంగా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేసి ప్రస్తుతం మనం చూస్తున్న ఒక్కడు మూవీని తెరకెక్కించారు. అయితే అర్జున్ మూవీని మాత్రం గుణశేఖర్ అదే తరహా స్క్రీన్ ప్లేతో చూపించడానికి ప్రయత్నం చేశారు. అర్జున్ మూవీని గమనిస్తే సినిమా స్టార్టింగ్ లోనే పవర్ ఫుల్ సన్నివేశాలను పెట్టిన గుణశేఖర్ ఆ తర్వాత కథను ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లారు.

ఈ మధ్య కాలంలో గుణశేఖర్ సక్సెస్ రేట్ తగ్గిందనే సంగతి తెలిసిందే. గుణశేఖర్ మహేష్ కు నప్పే కథతో భారీ సినిమాను ప్లాన్ చేస్తే మాత్రం మరో బ్లాక్ బస్టర్ ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus