ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ సెకండ్ వీకెండ్ ను కూడా బాగానే ఉపయోగించుకుంటోంది. ఈ వీకెండ్ లో ఈ సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ తమ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సలార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి వేర్వేరు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో రిలీజవుతుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట.
సలార్ మూవీ ఇప్పట్లో ఓటీటీలో వచ్చే ఛాన్స్ అయితే లేదని మేకర్స్ చెబుతున్నారు. ఎనిమిది వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ ఇతర ఓటీటీలకు ఊహించని స్థాయిలో షాకిస్తూ వరుసగా క్రేజీ సినిమాల హక్కులను కొనుగోలు చేస్తుండటం గమనార్హం.
సలార్ సినిమా 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సలార్1 ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించగా సలార్2 మూవీ మాత్రం కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్ మూవీలో నటించిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.
సలార్ (Salaar) సక్సెస్ తో భాషతో సంబంధం లేకుండా ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది. రాబోయే రోజుల్లో వరుస విజయాలు ప్రభాస్ ఇమేజ్ ను మరింత పెంచుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. కెరీర్ పరంగా ప్రభాస్ కు లక్ కూడా కలిసొస్తే మరిన్ని ఇండస్ట్రీ హిట్లు ప్రభాస్ ఖాతాలో చేరతాయని చెప్పవచ్చు.