Sushanth, Meenakshi: సుశాంత్ తో మీనాక్షి చౌదరి ఎంగేజ్మెంట్.. నిజమేనా?

మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్. ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)  తో ఈమె క్రేజ్ పెరిగింది. వరుణ్ తేజ్ (Varun Tej)  తో చేసిన ‘మట్కా'(Matka) విడుదలకు రెడీగా ఉంది. విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్. మరోపక్క వెంకటేష్ తో (Venkatesh)  ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) అనే సినిమా చేస్తుంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. సో మీనాక్షి ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నట్టే..!

Sushanth, Meenakshi:

ఇలాంటి టైంలో సినిమాలకి గ్యాప్ ఇచ్చి పెళ్లి పీటలు ఎక్కుదామని ఏ హీరోయిన్ అనుకోదు. కానీ మీనాక్షి అనుకుంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. 4,5 రోజుల నుండి మీనాక్షికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. మీనాక్షి చౌదరి తన మొదటి సినిమా హీరో అయినటువంటి సుశాంత్ (Sushanth)..ని పెళ్లాడబోతున్నట్టు ఆ వార్త యొక్క సారాంశం. త్వరలోనే వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది అంటూ కొందరు కథనాలు పుట్టించారు.

అయితే ఇందులో ‘ఎంత మాత్రం నిజం లేదు’ అనేది మీనాక్షి చౌదరి టీం చెబుతున్న మాట. సుశాంత్, మీనాక్షి.. మంచి స్నేహితులు. పైగా సుశాంత్ (Sushanth) హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కాబట్టి.. ఈ వార్త నిజమే అని నమ్మే వారి సంఖ్య ఎక్కువవుతోంది.! అందుకే మీనాక్షి చౌదరి టీం మొహమాటం లేకుండా క్లారిటీ ఇస్తుంది. అయితే అధికారిక ప్రకటన కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పాలి.

దిల్ రాజు భార్య తేజస్విని ఇన్స్టా పోస్ట్ వైరల్.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus