‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున తిరుమలలో దర్శకుడు ఓం రౌత్.. హీరోయిన్ కృతి సనన్ ను కౌగిలించుకుని, ముద్దులు పెట్టిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయం ముందు అదేం పని అంటూ అక్కడున్న భక్తులు షాక్ కు గురయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ ఒక్కరు అభ్యంతరకరంగా ప్రవర్తించినా.. ఆలయ కమిటీ వారు తీవ్రంగా స్పందిస్తారు. అందుకే దర్శకుడు ఓం రౌత్ పై కేసు కూడా నమోదవ్వడం జరిగింది.
ఓం రౌత్ .. నార్త్ ఇండియాకి చెందిన వ్యక్తే.. అక్కడ ఇలాంటివి చాలా చిన్న విషయాలు. చెప్పాలంటే అక్కడ కామన్. కానీ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో కొన్ని పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే ఇలాంటి విమర్శలే ఎదురవుతాయి. పైగా ‘ఆదిపురుష్’ లో కృతి సనన్ సీతగా చేసింది. ఇక ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. సన్నీ డియోల్ ,అమీషా పటేల్ నటిస్తున్న ‘గదర్ 2 ‘ సినిమా కోసం గురుద్వార్ లో కౌగిలింతలు, ముద్దు సన్నివేశాలు (Movie Making) తీసారట.
అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. గురుద్వార్ అనేది సిక్కులకు అత్యంత పవిత్రమైన స్థలం. దేవుడికి నమస్కరించే సన్నివేశాలు తీస్తామని చెప్పి పర్మిషన్ తీసుకుని.. ఇలాంటి సన్నివేశాలు తీశారు అంటూ గురుద్వార్ నిర్వాహకులు మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ లతో పాటు సిక్కు మతస్థులు కూడా మండిపడుతున్నారు. దీంతో ‘మీరు మారరు’ అంటూ బాలీవుడ్ సెలబ్రిటీల పై నెగిటివ్ కామెంట్లు గుప్పిస్తున్నారు నెటిజెన్లు.