Balachander: ఆ సినిమా తీసినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు బాలచంద్రన్!

తల్లిదండ్రుల ప్రభావం మనపై ఉండవచ్చు..ఉండకపోవచ్చు గానీ సినిమాల ప్రభావం మాత్రం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. నచ్చిన హీరోలు ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అవుతారో ఆ విధంగానే మనం కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కొంతమంది అయితే హీరోలు ధరించే దుస్తులను చూసి కొనుగోలు చేస్తూ ఉంటారు. అలానే వాళ్ళ యాటిట్యూడ్ ని వాళ్ళ స్టైల్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. నచ్చిన సినిమాల్లో డైలాగులని వాడడం..

వాళ్ల మేనరిజాన్ని అనుసరించడం ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. అయితే ఇది ఈ రోజుల్లోనే కాదు ఇది వరకు కూడా హీరోలు, హీరోయిన్లని చూసి అలా ఫాలో అవుతూ ఉండేవారు. ఇక ఇదిలా ఉంటే కమల్ హాసన్, సరిత జంటగా నటించిన మరో చరిత్ర సినిమా గురించి మీకు తెలిసే ఉంటుంది. కే. బాలచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అద్భుతమైన ప్రేమ కావ్యం ఇది.

ఈ సినిమా అప్పట్లో ఎంతో మంది హృదయాలని గెలుచుకుంది. యూత్ అయితే ఏకంగా ఈ సినిమాని అనేక సార్లు చూశారు. ఈ సినిమాకి అద్భుతమైన ట్రాజిడీ ఎండింగ్ ని ఇచ్చారు దర్శకుడు. ఈ చిత్రం అప్పటి ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఇది ఇలా ఉంటే అప్పట్లో ఈ సినిమాని ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ప్రేమలో సక్సెస్ అవ్వలేదు అని సూసైడ్ నోట్ రాసి ఈ సినిమా గురించి కూడా రాసి చనిపోయేవారట.

ఏకంగా 20 జంటలకు పైగా ఈ సినిమాను చూసి సూసైడ్ చేసుకున్నారు. దీనితో మానవహక్కుల సంఘాలు మరియు కొన్ని అభ్యుదయ సంఘాలు దర్శకుడు బాలచంద్రన్ ని తిట్టడం మొదలు పెట్టాయి. అప్పుడు బాల చంద్రన్ ఈ సినిమాను తీసి తప్పు చేశాను. నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇది క్షమించండి అని చెప్పారు. అలాగే ఈ సినిమాని తీసినందుకు ప్రతి రోజు నేను పశ్చాతాప పడుతున్నాను అని ఆయన చెప్పారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus