Soundarya, Sai Kumar: సౌందర్య – సాయి కుమార్ ల గురించి ఎవ్వరికీ తెలియని విషయం అదే..!

దివంగత స్టార్ హీరోయిన్, ‘మహానటి’ సావిత్రి గారి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈమె ప్రాణాలతో లేదు కానీ ఈమె గుర్తుండి పోయే సినిమాలు, గుర్తుండిపోయే పాత్రలు చేసింది అన్నది వాస్తవం. కన్నడ పరిశ్రమకు చెందిన అమ్మాయే అయినప్పటికీ సౌందర్యను తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకొన్నారు.స్టార్ హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలే చేయాలి.. స్టార్ హీరోల సినిమాల్లోనే నటించాలి అనే పద్ధతిని ఈమె పూర్తిగా మార్చేసింది.

ఈమె (Soundarya) ఎంత స్టార్ డం సంపాదించుకున్నా.. చిన్న హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించడానికి ఇన్సెక్యూర్ గా ఫీలయ్యేది కాదు అన్నది వాస్తవం. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.అయితే 2004 లో సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. సౌందర్య అప్పట్లో తిరుగులేని స్టార్ హీరోయిన్ కాబట్టి.. ఈమె పై కూడా ఎక్కువ రూమర్స్ వచ్చేవి.

వెంకటేష్,జగపతి బాబు వంటి స్టార్ హీరోలతో సౌందర్య ప్రేమాయణం నడిపింది అంటూ చాలా వార్తలు వచ్చాయి. ఇక ‘అంతఃపురం’ సినిమా టైంలో అయితే సాయి కుమార్ ను సౌందర్య ప్రేమించిందని.. పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యిందని… కానీ వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదని ప్రచారం జరిగింది. అయితే అప్పటికే సాయి కుమార్ కు పెళ్లైంది.

మరి ఇలాంటి ప్రచారం ఎందుకు జరిగింది అన్నది తనకు కూడా తెలియదు అని సాయి కుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక సౌందర్య 2003 లో జి.ఎస్.రఘు అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను సౌందర్య ఆస్తిని ఎంజాయ్ చేస్తున్నాడు. సౌందర్య తల్లిదండ్రులకు, సోదరులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదనే ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus