విజయశాంతి (Vijaya Shanthi) సినిమాలకి గ్యాప్ ఇచ్చారు. ‘నాయుడమ్మ’ తర్వాత దాదాపు 14 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి.. 2020 లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఆ సినిమాకి దర్శకుడు. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ఆ సినిమాలో అతి కీలకమైన పాత్ర పోషించారు విజయశాంతి. సినిమా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ‘కొడుకు చనిపోయాడు’ అనే విషయాన్ని గ్రహించే సీన్లో విజయశాంతి (Vijayashanti) నటన కానీ మహేష్ నటన కానీ అద్భుతం అని చెప్పాలి.
వీళ్లిద్దరి కాంబోలో వచ్చే సన్నివేశాల్ని దర్శకుడు అనిల్ రావిపూడి బాగా రాసుకున్నాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ టైంలో తల్లి పాత్రలు చేయడం ఇష్టం లేదు అన్నట్టు విజయశాంతి చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ (Raja the Great) సినిమాలో రాధిక చేసిన పాత్రని కూడా ఆమె అందుకే రిజెక్ట్ చేసిందట. కానీ కట్ చేస్తే.. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) అనే సినిమా వస్తుంది. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో విజయశాంతి (Vijayashanti) తల్లి పాత్ర పోషిస్తున్నారు.
‘తల్లి పాత్రలు చేయడం ఇష్టం లేదు’ అని చెప్పిన విజయశాంతి… కళ్యాణ్ రామ్ కి తల్లిగా చేయడానికి ఎలా ఒప్పుకున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ పాత్ర చేయడం కోసం ఆమెకు రూ.3 కోట్లు ఆఫర్ చేశారట. సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోయిన్ కి ఈ రేంజ్ పారితోషికం అంటే చిన్న విషయం కాదు. పైగా ఇందులో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నారు. ఫైట్లు వంటివి కూడా చేశారు. హీరోకి ఏమాత్రం తీసిపోని పాత్ర ఇది అని టాక్.