Srikanth Iyengar: శ్రీకాంత్ అయ్యంగర్ ను కూతుర్లు కూడా దూరం పెట్టారా..!

ఈమధ్య కాలం లో బాగా పాపులర్ అయినా క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకరు శ్రీకాంత్ అయ్యంగర్ అలియాస్ శ్రీకాంత్ భరత్ . ప్రతీ శుక్రవారం విడుదల అయ్యే సినిమాలలో కచ్చితంగా శ్రీకాంత్ అయ్యంగర్ ఉండాల్సిందే. చిన్న సినిమాలకు ఆయనే కావాలి, పెద్ద సినిమాలకు ఆయనే కావాలి. 2005 వ సంవత్సరం లో ఈయన అంగ్రీజ్ అనే బాలీవుడ్ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత సుమారుగా 8 ఏళ్ళు మళ్ళీ ఇండస్ట్రీ వైపు చూడలేదు.

గ్యాప్ ఎందుకు అంతలా వచ్చిందో తెలియదు కానీ, 2013 వ సంవత్సరం లో వరుణ్ సందేశ్ హీరో గా నటించిన ‘చమ్మక్ చల్లో’ చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. అలా ప్రారంభమైన శ్రీకాంత్ కెరీర్ అప్పుడే 50 సినిమాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఏకంగా ఆయన 7 సినిమాల్లో కనిపించాడు. గత ఏడాది దాదాపుగా 16 సినిమాల్లో నటించాడు. శ్రీకాంత్ అయ్యంగార్ ఇంత బిజీ గా గడుపుతున్నాడు కదా, అతని వ్యక్తిగత జీవితం చాలా లగ్జరీ గా ఉంటుంది అనుకుంటే పొరపాటే.

శంషాబాద్ లోని ఎక్కడో ఒక మారుమూల వీధిలో మూడు కుక్కల్ని పెంచుకుంటూ ప్రపంచానికి దూరంగా ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఈయనకి పెళ్ళై విడాకులు కూడా జరిగిపోయింది అట. ఇద్దరు కూతుర్లు ఉండేవారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడట ఒకప్పుడు. కానీ శ్రీకాంత్ ఎక్కువగా ముందుకు బానిస అవ్వడం తో కూతుర్లు ఇద్దరూ ఆయనని కలవడం ఆపేసారు. ఇప్పుడు ఎవ్వరూ లేని ఒంటరి వాడిగానే జీవిస్తున్నాడు.

ఆయన (Srikanth Iyengar) అదృష్టం ఏమిటంటే 50 ఏళ్ళు దాటినా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ గా గడపడమే. వరుసగా సినిమాలు చేస్తూ ఒంటరి తనాన్ని తరిమేశాడు. రాబొయ్యే రోజుల్లో ఇక ఆయన ఏ రేంజ్ కి వెళ్తాడో చూడాలి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ ‘సలార్‘, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలలో నటిస్తున్నాడు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus