Pushpa 2: ‘పుష్ప 2’ ట్రైలర్లో ఇది గమనించారా… కొంపతీసి ట్రాజెడీ క్లైమాక్స్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  నటించిన ‘పుష్ప’ (Pushpa) 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి ఆ ఏడాదికి బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులు కొట్టింది. ఇక దానికి కొనసాగింపుగా ‘పుష్ప 2’ (Pushpa 2) వస్తుందని కూడా ముందుగానే ప్రకటించారు. దీంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న ‘పుష్ప 2’ విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ డోస్ పెంచారు. అందులో భాగంగా నిన్న ట్రైలర్ లాంచ్ ను పాట్నాలో ఏర్పాటు చేశారు.

Pushpa 2

ఇక యూట్యూబ్లో ‘పుష్ప 2’ ట్రైలర్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. 24 గంటలు గడవక ముందే 40 మిలియన్ వ్యూస్ దాటేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ‘పుష్ప 2’ ట్రైలర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ట్రైలర్ చూసిన కొంతమంది అల్లు అర్జున్ పాత్ర అంటే పుష్ప పాత్ర చనిపోతుందా అని అనుమానపడుతున్నారు?

వివరాల్లోకి వెళితే.. ట్రైలర్లో ఒక షాట్ పై ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది. దానిని గమనిస్తే..ఎర్రచందనం దుంగలపైన పడుకోబెట్టి ఒక శవానికి దహన సంస్కారాలు చేస్తున్నారు.ఈ సీన్ లో అల్లు అర్జున్ కి సపోర్ట్ ఇచ్చే భూమిరెడ్డి సిద్దప్ప నాయుడు(రావు రమేష్) (Rao Ramesh) ఉన్నాడు, కానీ పుష్ప (అల్లు అర్జున్) లేడు. ఒకవేళ పుష్ప భార్య శ్రీవల్లి చనిపోతే అక్కడ పుష్ప కూడా ఉండాలి కదా.

 

కానీ లేడు. అప్పుడు ఆ ఎర్రచందనం దుంగలపై దహనం చేస్తుంది ఎవరిని? బహుశా.. పుష్ప తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించి… అటు తర్వాత ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా అవతరిస్తాడా? వంటి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే.. ‘పుష్ప 2’ రిలీజ్ అయ్యే వరకు ఆగాలి.

సుజీత్‌ సినిమా కోసం నాని ఎవరిని ఓకే చేస్తాడు? అందుకే లేట్‌ అవుతోందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus