Mahesh Babu, Rajamouli: మహేష్ జక్కన్న మూవీ షూట్ కు పదేళ్లు.. షాకవుతున్న ఫ్యాన్స్!

మహేష్ జక్కన్న కాంబో సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ తో పోల్చి చూస్తే అనధికారికంగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో సినిమాకు సంబంధించి పుకార్లు వైరల్ అవుతుండటం గురించి మహేష్ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైందని ఒక వార్త ప్రచారంలోకి వస్తుండగా మరోవైపు ఈ సినిమా షూట్ పదేళ్లు జరగనుందని మూడు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ వార్తలు నమ్మేలా లావు. జక్కన్న బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించిన నేపథ్యంలో ఈ వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

మహేష్ (Mahesh) జక్కన్న కాంబో మూవీ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు సైతం భావిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి అధికారికంగా ప్రకటనలు వస్తే మాత్రమే నమ్మాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రాజమౌళి ప్రతిభకు ఇప్పటికే ఊహించని స్థాయిలో గుర్తింపు దక్కింది.

రాజమౌళి పారితోషికం 150 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. రాజమౌళి సినిమా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడటం లేదు. రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఇతర భాషల హీరోలు సైతం ఆశ పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. వేగంగా సినిమాలను తెరకెక్కించడంతో పాటు జక్కన్న మరిన్ని భారీ విజయాలను అందుకునే దిశగా అడుగులు వేస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus