NTR30 Movie: ఆ ట్విస్ట్ చుట్టే కథ తిరుగుతుందా.. ఎన్టీఆర్30కు హైలెట్ అదేనా?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దాదాపుగా రెండేళ్ల పాటు కష్టపడి ఎన్టీఆర్30 మూవీ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. ఈ మధ్య కాలంలో డ్యూయల్ రోల్ లో నటించడానికి దూరంగా ఉన్న తారక్ ఎన్టీఆర్30 సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఒక పాత్రకు సంబంధించిన కీలక విషయాలను కొరటాల శివ ఇప్పటికే రివీల్ చేశారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో పాత్రకు సంబంధించి తాజాగా ఒక అప్ డేట్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాలోని ఇంటర్వల్ సమయంలో ఒక పాత్రకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో సెకండాఫ్ మొత్తం ఈ పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. క్రేజీ ట్విస్టులతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా తారక్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్30 (NTR30 ) వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానుంది. చాలా రోజుల క్రితమే రిలీజ్ డేట్ ను ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ లో దాదాపుగా మార్పు లేదని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా సాయిపల్లవి మరో హీరోయిన్ గా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నా అధికారికంగా స్పష్టత వచ్చేవరకు ఈ వార్తలను నమ్మాల్సిన అవసరం లేదు.

ఎన్టీఆర్, సాయిపల్లవి కాంబినేషన్ గురించి వార్తలు రావడం కొత్తేం కాదు. డ్యాన్స్ లో ఎన్టీఆర్, సాయిపల్లవి టాప్ లో ఉండటంతో ఈ కాంబినేషన్ ను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ ఫిక్స్ అవుతుందేమో చూడాలి. వార్ సినిమా వల్ల ఎన్టీఆర్ లైనప్ లో మార్పు వచ్చిందని కామెంట్లు వినిపిస్తుండగా తారక్ పుట్టినరోజున తారక్ సినిమాల ప్లానింగ్ కు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus