లోకనాయకుడు కమల్ హాసన్ & సూపర్ స్టార్ రజిని కాంత్ , సౌత్ లోనే కాదు ఇండియన్ మూవీ ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అనటంలో సందేహం ఏమి లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఇద్దరు పోషించిన పాత్రలు , అందించిన హిట్స్ వాళ్లకి మాత్రమే సాధ్యం. వాళ్ళ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే ఫ్యాన్స్ అంత ఒక ఎక్సయిటింగ్ వైబ్ లో ఉంటారు. అలాంటి ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనపడితే ఎలా ఉంటుంది ? అసలు అది జరిగితే ఎలా ఉంటుంది ? ఇది జరగబోతుంది అంటున్నాయి సినీ వర్గాలు.
మరి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ని ఒప్పించగలిగే డైరెక్టర్ ఎవరు ? ఎలాంటి కథ అయితే ఇద్దరు ఓకే చెప్తారు ? అసలు ఈ కాంబినేషన్ ని సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకురాగలిగే దర్శకుడు ఉన్నాడా? ఇలాంటి అనేక రకాలైన ప్రశ్నలకి చివరికి సమాధానం దొరికింది అనే చెప్పాలి. ఆ దర్శకుడు ఎవరో కాదు జైలర్ మూవీ తో ప్రభంజనం సృష్టించిన నెల్సన్ దిలీప్ కుమార్ . ఇద్దరినీ తన కథనం తో ఒప్పించాడు అంట ఈ డైరెక్టర్. ఆల్రెడీ జైలర్ 2 షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ , సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

జైలర్ 2 తరువాత నెల్సన్ తెరకెక్కించబోయే సినిమానే రజిని కమల్ ల కాంబోలో చేయబోయే మల్టీస్టారర్ సినిమా అని కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ సినిమా కమల్ హసన్ నిర్మాణ సంస్థ (kamal hasan production)లో నిర్మాణం జరగనుంది. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గురించిన అఫిసియల్ అనౌన్స్ మెంట్ నవంబర్ 7న రానుంది అంటున్నారు. ఎందుకు నవంబర్ 7 న అంటే ఆ రోజు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా అఫిసియల్ గా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. దీంతో కమల్ బర్త్డే కి రజిని కమల్ ఇద్దరి అభిమానులు ఇరువురు ఖుషి అవ్వనున్నారు.
