భారతీయ చిత్ర పరిశ్రమలో సహ నటులను ప్రేమించి పెళ్లాడిన తారలు ఎందరో వున్నారు. వీటిలో కొన్ని కథలు కంచికి చేరితే.. కొన్నిమాత్రం పీటల వరకు వచ్చి ఆగిపోయాయి. ఇంకొన్ని వాటికి విషయానికి వస్తే.. ఇద్దరికి ప్రేమ వున్నా రకరకాల కారణాలతో మనసులోనే దాచుకునేవారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. హాస్య ప్రధానమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నారు నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్. కామెడీకి హీరోయిజాన్ని, స్టార్ స్టేటస్‌ని తెచ్చిన నటుడాయన. ఒకవైపు హాస్య చిత్రాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పించారు .
రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసి కడుపుబ్బా నవ్వుతూ సమస్యలను కొద్దిసేపైనా మర్చిపోయే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారనడంలో అతిశయోక్తి కాదు. ఈ విషయాన్ని అప్పటి ప్రధానమంత్రి, తెలుగు తేజం పీవీ నరసింహారావు స్వయంగా వెల్లడించారు. అయితే అప్పట్లో రాజేంద్రప్రసాద్ అందాల తార రజినీ మధ్య ఏదో వుందని ఇండస్ట్రీ కోడై కూసింది. 1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘‘ఆహా నా పెళ్లంట’’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఎన్నో సినిమాల వరకు సాగింది. భలే మొగుడు, గుండమ్మగారి కృష్ణులు, భామా కలాపం, జీవనగంగ, చిక్కడు దొరకడు, బంధువులొస్తున్నారు జాగ్రత్త, చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం, గడుగ్గాయి వంటి సినిమాలతో రాజేంద్రప్రసాద్- రజినిలు హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పుడంటే హీరో హరోయిన్లు చనువుగా వుండేవారు .. కానీ 1980లలో భారతీయ సినిమా టోటల్ డిఫరెంట్. కట్టుబాట్లు, రకరకాల సంప్రదాయాలు వుండేవి. ఈ నేపథ్యంలో నటీనటులు తమ పని తాము చేసుకుని విడివిడిగా వుండేవారు. ఈ క్రమంలో రజినీతో మాత్రం రాజేంద్ర ప్రసాద్ కాస్త చనువుగానే ఉండేవారు. అందుకే ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని అప్పట్లో ఫుకార్లు షికారు చేశాయి. కానీ ఇవేవి పట్టించుకోకుండా వారిద్దరూ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ఒకానొక సందర్భంలో రజినీ స్పందిస్తూ… తమ మధ్య స్నేహాన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారని వెల్లడించింది . ఇప్పటికీ తామిద్దరం మంచి మిత్రులుగానే కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
Most Recommended Video
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!