ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరో.. ఏకంగా 20 ప్రాజెక్టులు..!

స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి రెండు, ప్రాజెక్టులు ఓకే చేయడమే గగనం. అలాంటిది ఒకే ఏడాదిలో 20 ప్రాజెక్టులు ఓకే చేశాడట ఓ స్టార్ హీరో. వివరాల్లోకి వెళితే… మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘శివపురం’ ‘ఉరుమి’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.ప్రస్తుతం అతను ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సలార్’ లో కూడా నటిస్తున్నాడు. ఇతను మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే.

నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్గా డిఫెరెంట్ జోనర్ కథలతో అటు అభిమానులను ఇటు ప్రేక్షకులను అలరిస్తుంటాడు. తెలుగులో పవన్ కళ్యాణ్-రానా లు కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ … ఇతని ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.అంతేకాదు చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’.. ఇతను డైరెక్ట్ చేసిన ‘లూసిఫర్’ కు రీమేక్. అలాగే ఈయన మోహన్ లాల్ తో కలిసి నటించిన ‘బ్రో డాడీ’ కూడా తెలుగులో రీమేక్ కానుంది. ఇటీవల పృథ్వీరాజ్ నుండీ వచ్చిన ‘జనగణమన’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా..పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకే ఏడాదిలో 20 ప్రాజెక్టులు ఓకే చేయడం.. ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది.అంతకు ముందు విజయ్ సేతుపతి కూడా ఇలానే 25 ప్రాజెక్టులు వరకు ఓకే చేశాడు. అతని తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ లిస్ట్ లో చేరినట్టు తెలుస్తుంది..! ఇందులో వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయట. ఈయన ఓకే చేసిన సినిమాలు అన్నీ ఒకదానికొకటి సంబంధం లేని జోనర్ అని తెలుస్తుంది.

కొన్ని ప్రాజెక్టుల్లో ఆయన నటిస్తుండగా.. మరికొన్ని సినిమాలకు నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్టుల్లో ‘గోల్డ్’ అనే చిత్రం కూడా ఒకటి. ఇందులో నయనతార కూడా నటించబోతుంది. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus