ఎప్పుడో 4 ఏళ్ళ క్రితం విడుదల కావాల్సిన సినిమా.. గోపీచంద్ – నయనతార.. ల ‘ఆరడుగుల బుల్లెట్’.బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘జయ బాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్’ బ్యానర్ పై తాండ్ర రమేష్ నిర్మించాడు. ఆర్ధిక లావాదేవీల కారణంగా ఈ చిత్రం విడుదల 4 సంవత్సరాల క్రితం ఆగిపోయింది.అయితే ఇటీవల ఈ చిత్రాన్ని ఆగష్ట్ లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు.
కానీ ఇప్పటివరకు విడుదల తేదీని ప్రకటించలేదు.చిన్న సినిమాల విడుదలకు ఇదే మంచి సమయం అని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆరడుగుల బుల్లెట్’ టీం ఎందుకు ముందడుగు వేయడం లేదు అనే డిస్కషన్లు ఇప్పుడు మొదలయ్యాయి. ఈ విషయం పై ఆరాతీయగా.. ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసే ఆలోచన దర్శకనిర్మాతలకు లేదట. అయితే వారి సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ కు రెడీగా ఉంది అనే అనౌన్స్మెంట్ ఇస్తే.. మంచి ఓటిటి డీల్ వస్తుందని వారి ప్రణాళిక అని తెలుస్తుంది.
నిజానికి 2020 లో ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయమని మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ అప్పుడు శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిన ‘జీ’ వారు అడ్డుపడ్డారు. తమకు రూ.8 శాటిలైట్ హక్కులు అమ్మారు.. మీరు ఓటిటిలో విడుదల చేస్తాము అంటే కచ్చితంగా అంత రేటు పెట్టి మేము కొనుగోలు చేసేవాళ్ళం కాదు అంటూ వాళ్ళు అడ్డుపడ్డారు. వాళ్లకి నచ్చచెప్పి ఒప్పించే లోపుమంచి ఆఫర్లు మిస్ అయిపోయాయి.