Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » అద్భుతాల హరివిల్లు “గీతా ఆర్ట్స్”

అద్భుతాల హరివిల్లు “గీతా ఆర్ట్స్”

  • April 15, 2016 / 06:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అద్భుతాల హరివిల్లు “గీతా ఆర్ట్స్”

కధ అనేది సినిమాకు పెద్ద పెట్టుబడి అని నమ్మే నాణ్యమైన సంస్థ, కధలో బలం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు అని నమ్మిన ధైర్యమైన సంస్థ, కధను నిర్ణయించే సమయంలో సగటు సామాన్య ప్రేక్షకుడిలా ఆలోచించే తత్వం, నమ్మిన కధను తెరకెక్కించే సమయంలో ఎక్కడా రాజీ పడని రాజసం, వెరసి గీతా ఆర్ట్స్ రూపంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అద్భుతాలను సృష్టించే అవకాశం కల్పించాయి. ఎన్నో, ఎన్నెన్నో విజయాలు, ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, మరెన్నో సాహసాలు, టాలీవుడ్ లో తొలిసారి దాదాపుగా 40కోట్లకు పైగా పెట్టుబడిని పెట్టి సినిమాను నిర్మించిన ఘనత ఒక్క గీతా ఆర్ట్స్ కే దక్కుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఒకరు కాదు, ఇద్దరు, ఎందరో టాప్ హీరోస్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన వినోదాత్మక హరివిల్లు గీత ఆర్ట్స్. తండ్రి పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు నేర్పిన క్రమశిక్షణ అనే పదమే ఆయుధంగా, ఎల్లప్పుడూ తండ్రి ఆశీసులను అందుకుంటూ టాలీవుడ్ ప్రౌడ్ ప్రొడ్యూసర్ గా, ట్రెండ్ ని ముందే తెలుసుకుంటూ సరికొత్త ట్రెండ్ సెట్టర్స్ కు ఊపిరి పోశారు ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ అధినేత అల్లు ఆరవింద్ గారు. ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే మరో పక్క ఎందరో యువ నిర్మాతలను టాలీవుడ్ కు ఆహ్వానించి, ఇన్‌స్పైరింగ్ ప్రొడ్యూసర్ గా, ఎంతో మందిని నిర్మాణ రంగంలో, తిరుగులేని నిర్మాతలుగా నిలిపారు. మెగాస్టార్ వెండి తెర వైభవానికి అపూర్వమైన ఆకృతి కల్పించినా…పవన్ కల్యాణ్ అనే యువ హీరోనూ పవర్ స్టార్ గా నిలిపినా, బన్నీ ను స్టైలిష్ స్టార్ గా, యూత్ ఐకాన్ గా తీర్చి దిద్దినా, యువ హీరో చర్రీని మెగా పవర్ స్టార్ గా నిలిపినా ఆ క్రెడిట్ అంతా గీతా ఆర్ట్స్ కే చెందుతుంది. బడా స్టర్స్ అయినటువంటి రజని కాంత్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్ ఇలా ఎందరినో చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలుగా మలచిన తీరు గీత ఆర్ట్స్ సంస్థ సినీ నిర్మాణ వైభవానికి ప్రతీకగా చెప్పవచ్చు.

Geetha Arts Moviesబడా హీరోలతో తప్ప, చిన్న సినిమాకు బిజినెస్ లేని కాలంలో సైతం ఎంతో సాహసోపేతంగా ఎందరినో తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంట్రొడ్యూస్ చేసి, శతాదినోత్సవాలను సగర్వంగా జరుపిన ఘనత, గీతా ఆర్ట్స్ సంస్థకే చెల్లుతుంది.

‘మెగాస్టార్’తో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు నిర్మించిన అదే సంస్థ, కొత్త వారితో సరికొత్త కదనంతో ‘పరదేశి’ అనే సినిమాను సగర్వంగా తెరకెక్కించింది. అంతేకాకుండా గజిని, జల్సా లాంటి బ్లాక్ బస్టర్స్ ని తెలుగు తెరకు అందించింది సైతం ఈ సంస్థనే. ఇక ‘మగధీర’తో టాలీవుడ్ చరిత్రని దశదిశలా వ్యాపింపజేయడమే కాకుండా అప్పటివరకూ ఉన్న రికార్డులను అన్నింటినీ తుడిచి పెట్టేసి, సరికొత్త రికార్డులను టాలీవుడ్ కు పరిచయం చేసింది. ఇలా ఎల్లవేళలా సరికొత్త సినిమాలతో దూసుకుపోతుంది ఈ సంస్థ. మరి అలాంటి సెన్సేషనల్ సినిమాలను తెరకెక్కించిన సంస్థలో గంగోత్రి సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసి, ఆర్యతో ‘లవర్ బాయ్’గా, బన్నీ, దేశముదురు లాంటి సినిమాలతో మాస్ హీరోగా, స్టైలిష్ స్టార్ గా మారిన అల్లు అర్జున్, హీరోగా ఒక పక్క, మరో పక్క మాస్ మ్యానియాను తన తలలోకి ఎక్కించుకుని, అభిమానుల అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమాలు తెరకెక్కిస్తూ, హీరోల అభిమానులు తమ అభిమాన హీరోలను ఎలా చూడాలి అనుకుంటారో దానికి వంద రెట్లు యాక్షన్ ను జోడించి, కేవలం హిట్స్ మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్స్ ను చిత్ర పరిశ్రమకు అందిస్తూ, ఓటమి ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ చలన చిత్ర రికార్డులకు తన చిత్రాలతో చెక్ పెడుతూ, పవర్ ప్యాక్డ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు ‘బోయపాటి’ శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘సరైనోడు’ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనంతో పాటు, కలక్షన్ల సునామీని సృష్టించి టాలీవుడ్ చరిత్రలోనే అటు అల్లు వారి వారసుడికి, ఇటు గీతా ఆర్ట్స్ కి, మరో పక్క డైనమిక్ డైరెక్టర్ బోయపాటికి సరికొత్త ట్రెండ్ ను సృష్టించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

Sarrainodu,Allu Aravind,Boyapati Sreenu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Arjun
  • #Ameer Khan
  • #Badrinath
  • #Chiranjeevi

Also Read

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari First Review: శర్వానంద్ ఖాతాలో ‘సామజవరగమన’ లాంటి హిట్టు పడిందా?

Nari Nari Naduma Murari First Review: శర్వానంద్ ఖాతాలో ‘సామజవరగమన’ లాంటి హిట్టు పడిందా?

Anaganaga Oka Raju Twitter Review: నవీన్ పోలిశెట్టి ఇంకో హిట్టు కొట్టేశాడా?

Anaganaga Oka Raju Twitter Review: నవీన్ పోలిశెట్టి ఇంకో హిట్టు కొట్టేశాడా?

Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

Mana ShankaraVaraprasad Garu: 25 రోజులు రాత.. 75 రోజులు తీత

Mana ShankaraVaraprasad Garu: 25 రోజులు రాత.. 75 రోజులు తీత

related news

Mana ShankaraVaraPrasad Garu: పోలికలు పెట్టి ఏం నిరూపిద్దామని.. అన్ని కథలూ ఒరిజినలేనా?

Mana ShankaraVaraPrasad Garu: పోలికలు పెట్టి ఏం నిరూపిద్దామని.. అన్ని కథలూ ఒరిజినలేనా?

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

Mana ShankaraVaraprasad Garu Collections: అదిరిపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Mana ShankaraVaraprasad Garu Collections: అదిరిపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Anil Ravipudi: బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన అనిల్‌ ఇప్పుడు కారు ఇవ్వాల్సిందేనా?

Anil Ravipudi: బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన అనిల్‌ ఇప్పుడు కారు ఇవ్వాల్సిందేనా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

trending news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Nari Nari Naduma Murari First Review: శర్వానంద్ ఖాతాలో ‘సామజవరగమన’ లాంటి హిట్టు పడిందా?

Nari Nari Naduma Murari First Review: శర్వానంద్ ఖాతాలో ‘సామజవరగమన’ లాంటి హిట్టు పడిందా?

3 hours ago
Anaganaga Oka Raju Twitter Review: నవీన్ పోలిశెట్టి ఇంకో హిట్టు కొట్టేశాడా?

Anaganaga Oka Raju Twitter Review: నవీన్ పోలిశెట్టి ఇంకో హిట్టు కొట్టేశాడా?

8 hours ago
Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

17 hours ago

latest news

The RajaSaab: ‘ఖలేజా’ కి ఏం జరిగిందో ‘ది రాజాసాబ్’ కి కూడా అదే జరుగుతుంది : మారుతీ

The RajaSaab: ‘ఖలేజా’ కి ఏం జరిగిందో ‘ది రాజాసాబ్’ కి కూడా అదే జరుగుతుంది : మారుతీ

19 hours ago
The RajaSaab: రూ.100 కోట్ల షేర్ సాధించిన ‘ది రాజాసాబ్’.. కానీ దారుణంగా పడిపోయిందిగా

The RajaSaab: రూ.100 కోట్ల షేర్ సాధించిన ‘ది రాజాసాబ్’.. కానీ దారుణంగా పడిపోయిందిగా

20 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

22 hours ago
Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago
Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version