ఇంద్రగంటి ఈజ్ బ్యాక్ .. టీజర్ ఆకట్టుకుంటుంది..!

సుధీర్ బాబు- దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న చిత్రంమిది. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌ పై బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి నుండీ ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండీ టీజర్ ను విడుదల చేసారు.

టీజర్ విషయానికి వస్తే… 6 సంవత్సరాలలో వరుసగా ఆరు సూపర్‌హిట్‌లను అందించిన కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా హీరో సుధీర్ బాబు ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాడు.అయితే హీరో సాధించిన ఘనతను, అతని స్నేహితుడు రొటీన్ మరియు మార్పులేని సినిమాలు అంటూ ఎగతాళి చేస్తాడు.ఈ క్రమంలో అతనికి హీరోయిన్ కృతి శెట్టి పరిచయం అవుతుంది. ఆమెకి సినిమాలు అంటే నచ్చదు.కానీ ఈమెతోనే ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేయాలని హీరో డిసైడ్ అయ్యేలా అతని స్నేహితుడు ప్రేరేపిస్తాడు.

హీరో సుధీర్ బాబు మరియు హీరోయిన్ కృతి శెట్టి వారి వారి పాత్రలతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. వారి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా అనిపిస్తుంది. పిజి విందా తన కెమెరా పనితనంతో మరోసారి కథనాన్ని అందంగా తీర్చిదిద్దినట్టు స్పష్టమవుతుంది.వివేక్ సాగర్ బిజిఎమ్‌ని కూడా బాగుంది. టీజర్ ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!


చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Share.