‘నా తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం ని #KGF2… ప్రపంచానికి ఇనాయత్ ఖలీల్‌గా పరిచయం చేసినందుకు గర్వపడుతున్నా. ముఖ్యంగా 65 ఏళ్ల వయస్సులో సినీ కెరీర్‌ను ప్రారంభించిన వ్యక్తి కోసం..ఆయన్ని నమ్మిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు.. పూర్తి క్రెడిట్ దక్కుతుంది. అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ ప్రముఖ నటుడు మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన ఆదర్శ్ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ఇనాయత్ ఖలీల్ పాత్ర ‘కె.జి.ఎఫ్2’ లో చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.
దుబాయ్ డాన్ పాత్రలో ఆయన కనిపించి మెప్పించారు. ప్రశాంత్ నీల్ కు బాలకృష్ణ బంధువు అని తెలుస్తోంది. అందుకే ఈ పాత్రకి ఆయన్ని ఎంపిక చేసుకున్నట్టు కూడా మొన్నామధ్య టాక్ నడిచింది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలీదు.అయితే ఇనాయత్ ఖలీల్ పాత్ర కేజీఎఫ్ చాప్టర్ 3 లో కూడా ఉండబోతుందనే హింట్ ఇచ్చారు. ఇక ఆదర్శ్ బాలకృష్ణ ‘బిగ్ బాస్ సీజన్ 1’ తెలుగు కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.
అప్పటివరకు విలన్ గా మాత్రమే పరిచయమైన ఆదర్శ్ లో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందని ఆ షోతో అందరికీ తెలిసింది. ‘హ్యాపీ డేస్’ ‘గోవిందుడు అందరివాడేలే’ ‘సరైనోడు’ ‘విన్నర్’ ‘రణరంగం’ వంటి చిత్రాల్లో నటించి బాగా పాపులర్ అయ్యాడు ఆదర్శ్. ప్రస్తుతం అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. భవిష్యత్తులో ఇతను కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోపక్క కె.జి.ఎఫ్2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ మూవీకి నెగిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీగా నమోదవుతున్నాయి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!