పైరసీతో సినిమాలు దెబ్బ తింటాయి, నిర్మాతలు నష్టపోతారు అని మీకు తెలుసు. కానీ పైరసీ వల్ల ఓ హీరో స్టార్ హీరో అవ్వడం ఎప్పుడైనా చూశారా? ఇలా కూడా అవుతారా అని మీరు అనుకోవచ్చు కానీ అలానే అయ్యాను అని ఆ హీరోనే చెప్పాడు. అతనే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఆయన సినిమాలు మన దేశంలో ఇప్పుడు సరిగ్గా ఆడటం లేదు. ఇటీవల చేసిన రెండు సినిమాలు దారుణమైన ఫలితాన్ని అందుకున్నాయి. అయితే అంతకుముందు రెండు సినిమాలు మన దేశంలోనే కాదు చైనాలో కూడా బాగా ఆడాయి.
‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాలు చైనాలో కూడా విడుదలై భారీ విజయం అందుకున్నాయి. ఆ వసూళ్లే ‘దంగల్’ సినిమా రూ. 2000 కోట్ల ప్లస్సుతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉంది. అక్కడి భారీ వసూళ్లే ఈ రికార్డుకు కారణం. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ మన దేశంలో కంటే చైనాలోనే బాగా ఆడింది అంటారు. అయితే ఈ రెండు సినిమాలు ఇంత బాగా ఆడటానికి ‘3 ఇడియట్స్’ (3 Idiots) కారణమట. అయితే ఆ సినిమా చైనాలో రిలీజ్ చేయకపోవడం గమనార్హం.
రాజ్ కుమార్ హిరాణీ (Rajkumar Hirani) దర్శకత్వంలో వచ్చిన ‘3 ఇడియట్స్’ సినిమా నాకు మంచి గుర్తింపును తెచ్చింది. ఈ సినిమాని చైనాలో విడుదల చేయకపోయినా నాకు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ సినిమాను పైరసీ కాపీల ద్వారా చూశారు. పైరసీ కారణంగానే నేను అక్కడ స్టార్ అయ్యాను అని నవ్వేశాడు ఆమిర్ ఖాన్. అలా పరిశ్రమకు చేటు చేస్తున్న పైరసీ.. ఆమిర్‌కి బాగా ఉపయోగపడింది.
డిజాస్టర్ సినిమాల గురించి పైన మాట్లాడుకున్నాం కదా. అదే విషయం ఆయన దగ్గర ప్రస్తావిస్తే నా సినిమాలు ఫెయిల్ అయితే అందరిలా బాధపడతా. ఓ పది, పదిహేను రోజులు డీప్రెషన్‌లోకి వెళ్లిపోతా. ఒక్కోసారి బాగా ఏడ్చేస్తా కూడా. ఆ తర్వాత ఆ ఫలితానికి కారణమేంటి అని ఆలోచిస్తాను. మళ్లీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను అని చెప్పాడు ఆమిర్.