Aamir Khan: షారుఖ్ ఖాన్ డైలాగ్స్ తో ఆమిర్ ఖాన్ సారీ!

బాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో ఆమిర్ ఖాన్ ఒకరు. ఆయన నటించిన ‘లగాన్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’, ‘దంగల్’ లాంటి సినిమాలు ఇండియన్ సినిమా స్థాయిని పెంచాయి. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఆమిర్ కి క్రేజ్ వచ్చింది. అయితే రీసెంట్ గా ఆయన నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమా రిజల్ట్ ఏంటో రిలీజ్ కి ముందే తెలిసిపోయిందని చెప్పాలి.

ట్రైలర్ ప్రేక్షలకు ఆకట్టుకోలేకపోయింది. దీనికి తోడు ఈ సినిమాపై బాయ్‌కాట్ ఎఫెక్ట్ పడింది. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉద్యమం చేశారు. దీని ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది. ఆమిర్ ఖాన్ గత సినిమాలు తొలిరోజు సాధించే వసూళ్లను ఈ సినిమా ఫుల్ రన్ లో రాబట్టిగలిగిందంటే సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా రిజల్ట్ ఆమిర్ ఖాన్ కి షాకిచ్చిందట.

సినిమా కోసం ఎంతగానో కష్టపడే ఆమిర్ ఖాన్ కు ప్రేక్షకులు ఇలాంటి శిక్ష వేస్తారని ఆయన ఊహించి ఉండరు. అయితే తన సినిమాను ప్లాప్ చేసినందుకు ఆమిర్ ఖాన్ ఆడియన్స్ మీద కోపం చూపించట్లేదు. వారి అంచనాలకు తగ్గ సినిమా చేయలేకపోయినందుకు పరోక్షంగా సారీ చెప్పారు. తాజాగా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. షారుఖ్ ఖాన్ సినిమా ‘కల్ హో నహో’ సినిమాలో కొన్ని డైలాగ్స్ ను గుర్తు చేస్తూ ప్రేక్షకులకు సారీ చెప్పింది ఆమిర్ ఖాన్ సంస్థ.

‘మనందరం మనుషులమే కాబట్టి అందరం తప్పులు చేస్తాం. కొన్ని సార్లు మాటలు తప్పవుతాయి.. కొన్ని సార్లు చేతలు తప్పవుతాయి. కొన్ని సార్లు మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయి. కొన్ని సార్లు మనం కోపంతో, మౌనంతో ఇతరులను బాధపెడతాం. నేను గనుక మనోభావాలను దెబ్బ తీసి ఉంటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరుతున్నా’ అనేది ఈ పోస్ట్ మీనింగ్. ఆ విధంగా ఆడియన్స్ కి సారీ చెప్పారు ఆమిర్.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus