Aamir Khan: మరోసారి ఆమిర్‌ ఖాన్ మార్కు నిర్ణయం.. ఏ సినిమా అంటే?

Ad not loaded.

సినిమా ఇండస్ట్రీలో కలల ప్రాజెక్టు అంటూ ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. దాని కోసం ఎన్నో ఏళ్లు శ్రమించి, నానా కష్టాలు పడి ఆ సినిమా చేస్తారు. తీరా సినిమా విడుదలయ్యేసరికి తుస్‌ మంటే ఆ బాధ వర్ణానాతీతం అని చెప్పొచ్చు. అలాంటి ఇబ్బందిని తాజాగా ఎదుర్కొన్న వ్యక్తి ఆమిర్‌ ఖాన్‌. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరు గాంచిన ఆమిర్‌.. ఆ సినిమా విషయంలో ఆ పర్‌ఫెక్షనే మిస్‌ అయ్యారు అని అంటుంటారు. రీమేక్‌ సినిమానే కలల ప్రాజెక్ట్‌ అనుకోవడమే తప్పు అని కూడా అంటారు. అయితే ఆ తర్వాతి సినిమాను కూడా ఆమిర్‌ రీమేకే చేస్తున్నాడని టాక్‌.

ఆమిర్‌ ఖాన్‌ చేసిన కలల ప్రాజెక్ట్‌ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. ఎప్పుడో 1990sలో విడుదలైన ‘ఫారెస్ట్‌ గంప్‌’ సినిమాను ఇప్పుడు ఎంచుకుని దెబ్బతిన్నాడు ఆమిర్‌. ఆ సినిమా విషయంలో అన్ని రకాలుగా ఆమిర్‌కు ఇబ్బంది కలిగింది. దీంతో సినిమాలకు ఆమిర్‌ కొద్ది రోజులు దూరమవుతాడు అని వార్తలొచ్చాయి. అయితే అదేం లేదని, కొత్త సినిమాను ఓకే చేయడంలో ఆయన బిజీగా ఉన్నాడని అంటున్నారు. 2018లో వచ్చిన స్పానిష్ సినిమా ‘క్యాంపియన్స్’ను హిందీలో చేయబోతున్నాడట ఆమిర్‌.

‘క్యాంపియన్స్‌’ సినిమా హక్కుల్ని ఇప్పటికే పొందిన ఆమిర్‌.. దీనికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్‌ చేశాడట. సంగీత త్రయం శంకర్ ఎహసాన్ లాయ్‌తో ఇటీవల సంగీత చర్చలు మొదలయ్యాయట. ఆర్ఎస్ ప్రసన్న అనే యువ దర్శకుడు ఈ సినిమాను హ్యాండిల్‌ చేస్తారట. ఆయన గతంలో ‘శుభ్ మంగళ్ సావధాన్’ అనే సినిమా చేశారు. రూ. 25 కోట్లతో తీసిన ఈ సినిమా రూ. 70 కోట్లు రాబట్టింది. అలాంటి దర్శకుడు అయితే ‘క్యాంపియన్స్‌’ సినిమాకు బాగుంటుందని ఆమిర్‌ అనుకున్నారట.

‘క్యాంపియన్స్‌’ విషయానికొస్తే.. ఇదో కామెడీ డ్రామా. కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి తక్కువగా ఉంటాయి. ఇక యాక్షన్ ఎలిమెంట్స్ పూర్తిగా లేవు. దీంతో ఇలాంటి సినిమాను ఆమిర్‌ ఎందుకు ఓకే అనుకున్నాడు అనేది తెలియాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 జనవరిలో ఈ సినిమా స్టార్ట్ అవుతుందట.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus