మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి భారీస్థాయిలో ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 800 నుంచి 1000 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీలో అమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మహేష్ సినిమాలో ఆసక్తికర పాత్ర కోసం అమీర్ ఖాన్ పేరును జక్కన్న పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
గతంలో రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా చేస్తానని కామెంట్ చేసిన అమీర్ ఖాన్ ఈ పాత్రలో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారని బోగట్టా. జక్కన్న డైరెక్షన్ లో నటించే అవకాశం ఉంటే ఎవరూ వదులుకోరు. మహేష్ అమీర్ ఖాన్ కాంబో అంటే అంచనాలు మామూలుగా ఉండవు. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ 3000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మహేష్ రాజమౌళి కాంబో మూవీ కొత్త తరహా కథాంశం ఉన్న కథతో తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ మొదలుకాకుండానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2026లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
రాజమౌళి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ రెమ్యునరేషన్ల కోసమే 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చవుతోందని బోగట్టా. ఆర్.ఆర్.ఆర్ కు ఆస్కార్ వస్తే మహేష్ జక్కన్న కాంబో మూవీ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?