Aamir Khan: ప్రెస్ మీట్ ఆలస్యం కావడంతో క్షమాపణలు చెప్పిన అమీర్!

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం తాను నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే అన్ని భాషలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా కొనసాగిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ లు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే హైదరాబాదులో స్పెషల్ ప్రీమియర్ షో వేడమే కాకుండా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు అయితే తాజాగా చెన్నైలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. అనుకున్న సమయానికన్నా కాస్త ప్రెస్ మీట్ ఆలస్యం కావడంతో మీడియా ప్రతినిధులు ఈ ప్రెస్ మీట్ కోసం కాస్త సమయం పాటు ఎదురు చూసారు. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ ఆలస్యమైనందుకు మీడియాకు అమీర్ ఖాన్ క్షమాపణలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ కొన్ని అనుకోని కారణాలవల్ల ప్రెస్ మీట్ ఆలస్యమైందని అందుకు తనను క్షమించాలని కోరారు. ఇక ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని, అమీర్ ఖాన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన కరీనాకపూర్ నటించారు. అదేవిధంగా మొదటిసారిగా టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఈ సినిమాలో అమీర్ ఖాన్ స్నేహితుడి పాత్రలో నటించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాని పెద్ద ఎత్తున తెలుగు తమిళ భాషలలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో విడుదల కానుంది. ఇలా మొదటిసారిగా ఒక బాలీవుడ్ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఈ ప్రమోషన్ కార్యక్రమాల కోసం సుమారుగా ఐదు నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.