అల్లు అర్జున్ (Allu Arjun) ,అనూ మెహతా (Anuradha mehta) జంటగా నటించిన ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ‘ఆర్య’ (Aarya) . సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శివ బాలాజీ (Siva Balaji) సెకండ్ హీరోగా నటించాడు. 2004 మే 7న పెద్దగా బజ్ లేకుండానే రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ‘గంగోత్రి’ (Gangotri) తో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ బన్నీకి దక్కలేదు. పైగా లుక్స్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తన లుక్స్ ని కంప్లీట్ గా మార్చుకుని ‘ఆర్య’ చేశాడు అల్లు అర్జున్..! డాన్సులు కూడా ఇరగదీసేశాడు.
సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ కూడా ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. అందుకే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నిర్మాత దిల్ రాజు (Dil Raju) , దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్.. ఈ ముగ్గురికీ ‘ఆర్య’ సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. నేటితో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న… ‘ఆర్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :
సీడెడ్ | 2.12 cr |
ఉత్తరాంధ్ర | 3.02 cr |
ఈస్ట్ | 0.87 cr |
వెస్ట్ | 0.79 cr |
గుంటూరు | 1.30 cr |
కృష్ణా | 1.09 cr |
నెల్లూరు | 0.72 cr |
ఏపీ+తెలంగాణ(టోటల్) | 15.71 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.42 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 18.13 cr |
‘ఆర్య’ చిత్రం రూ.9.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.18.13 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్లకు రూ.8.93 కోట్ల లాభాలను అందించి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2004 టాప్ -5 బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీస్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది ‘ఆర్య’ సినిమా.