AAY Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఆయ్’..!
- September 22, 2024 / 04:10 PM ISTByFilmy Focus
ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) హీరోగా ‘మ్యాడ్’ (MAD) అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అతను ‘ఆయ్’ (AAY) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu) , విద్యా కొప్పినీడి (Koppineedi Vidya) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేశాయి.
AAY Collections

గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్లో రూపొందిన కామెడీ సినిమా కాబట్టి.. యూత్ ఈ చిత్రం పై ఫోకస్ పెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కడుపుబ్బా నవ్వుకునే కామెడీ ఇందులో ఉందని రిలీజ్ రోజున టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా రాణించింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 3.00 cr |
| సీడెడ్ | 0.90 cr |
| ఆంధ్ర | 2.80 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 6.70 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.25 cr |
| ఓవర్సీస్ | 0.17 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 7.12 cr |
‘ఆయ్’ చిత్రానికి రూ.4.1 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.7.12 కోట్లు షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.2.72 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.












